KRK Collections: ‘కె.ఆర్.కె’ కలెక్షన్లు…వీకెండ్ ను పెద్దగా వాడుకోలేదు..!

  • May 2, 2022 / 08:27 PM IST

విజయ్ సేతుపతి హీరోగా నయనతార,సమంత లు హీరోయిన్లుగా … నయన్ తార ప్రియుడు విగ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కిన ట్రయాంగిల్ లవ్ స్టోరీ ‘కె.ఆర్.కె'(‘కన్మణి రాంబో కటీజా’). తమిళంలో ‘కాతు వాకుల రెండు కాదల్’ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని తెలుగులో నోరు తిరగలేని పేరుతో డబ్ చేసి విడుదల చేశారు. విజయ్ సేతుపతి తెలుగులో మంచి విలన్ గా, సహాయ నటుడిగా క్రేజ్ ను సంపాదించుకున్నాడు కానీ హీరోగా అతన్ని ఇక్కడి ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసింది లేదు.

ఇక నయనతార ఇమేజ్ కూడా ఇక్కడ అంతంత మాత్రమే. అయితే సమంత వల్ల ఈ చిత్రం పై మంచి బజ్ ఏర్పడింది.ఆమె వల్లే ఇక్కడ ఆ చిత్రానికి మంచి బిజినెస్ జరిగింది.అందులోనూ సమంత పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 28న విడుదలైన ఈ మూవీ బిలో యావరేజ్ టాక్ ను రాబట్టుకుంది. ఇక్కడ ప్రమోషన్లు పెద్దగా చేయకపోయినా మొదటి రోజు ఓకే అనిపించిన ఈ మూవీ వీకెండ్ వరకు ఆ జోష్ ను కంటిన్యూ చేయలేకపోయింది.

ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.35 cr
సీడెడ్ 0.18 cr
ఉత్తరాంధ్ర 0.14 cr
ఈస్ట్ + వెస్ట్ 0.09 cr
గుంటూరు + కృష్ణా 0.11 cr
నెల్లూరు 0.07 cr
ఏపి+తెలంగాణ 0.94 cr

‘కన్మణి రాంబో కటీజా’ చిత్రానికి రూ.2.05 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.2.15 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. ఫస్ట్ వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.0.94 కోట్ల షేర్ ను నమోదు చేసింది. జీఎస్టీ కాకుండా వచ్చిన షేర్ ఇదని ట్రేడ్ పండితుల సమాచారం. అది తీసేస్తే రూ 0.74 కోట్ల షేర్ గా ఉంటుంది అనేది అంచనా. ‘ఆచార్య’ రిలీజ్ అవ్వడంతో ఈ చిత్రానికి థియేటర్లు తగ్గాయి. లేదంటే మరింతగా కలెక్ట్ చేసి ఉండేది.

ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

కన్మణి రాంబో కటీజా సినిమా రివ్యూ & రేటింగ్!
వీళ్ళు సరిగ్గా శ్రద్ద పెడితే… బాలీవుడ్ స్టార్లకు వణుకు పుట్టడం ఖాయం..!
కే.జి.ఎఫ్ హీరో యష్ గురించి ఈ 12 విషయాలు మీకు తెలుసా..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus