ధనుష్ (Dhanush)- నాగార్జున (Nagarjuna) కాంబినేషన్లో ‘కుబేర’ (Kuberaa) వచ్చింది. జూన్ 20న రిలీజ్ అయిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి వారం పూర్తయ్యింది.
వీకెండ్ వరకు బాగా క్యాష్ చేసుకున్న ఈ సినిమా… వీకెండ్ తర్వాత స్లో అయ్యింది. ఎ సెంటర్స్ లో డీసెంట్ గా కలెక్ట్ చేస్తున్నా… బి, సి సెంటర్స్ లో తగ్గాయి. మొత్తంగా మొదటి వారం అయితే పర్వాలేదు అనిపించింది. బ్రేక్ ఈవెన్ కి కొద్ది దూరంలో ఉంది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 12.38 cr |
సీడెడ్ | 3.65 cr |
ఉత్తరాంధ్ర | 4.45 cr |
ఈస్ట్ | 2.15 cr |
వెస్ట్ | 1.32 cr |
గుంటూరు | 1.82 cr |
కృష్ణా | 1.98 cr |
నెల్లూరు | 1.02 cr |
ఏపీ+తెలంగాణ | 28.77 cr (షేర్) |
తమిళనాడు | 9.35 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 5.62 cr |
ఓవర్సీస్ | 15.25 cr |
వరల్డ్ టోటల్ | 58.99 cr (షేర్) |
‘కుబేర’ (Kuberaa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.58.99 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.100.6 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం ఈ చిత్రం మరో రూ.1.01 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.