ధనుష్ (Dhanush) – నాగార్జున (Nagarjuna) – దర్శకుడు శేఖర్ కమ్ముల కలయికలో ‘కుబేర’ (Kuberaa) వచ్చింది. జూన్ 20న రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ‘ఏషియన్ సినిమాస్’ ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్, శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడమే కాదు.. చాలా కాలం తర్వాత మంచి కలెక్షన్స్ సాధించగలిగింది ఈ సినిమా. మొదటి వీకెండ్, రెండో వీకెండ్ ను ఈ సినిమా బాగా క్యాష్ చేసుకుంది.
వీక్ డేస్ లో మాత్రం కొంత తడబడింది. అయినప్పటికీ 2 వారాల్లో మంచి కలెక్షన్స్ నే సాధించింది అని చెప్పాలి. ఒకసారి 2 వీక్స్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 15.94 cr |
సీడెడ్ | 4.50 cr |
ఉత్తరాంధ్ర | 5.61 cr |
ఈస్ట్ | 2.67 cr |
వెస్ట్ | 1.57 cr |
గుంటూరు | 2.17 cr |
కృష్ణా | 2.33 cr |
నెల్లూరు | 1.21 cr |
ఏపీ+తెలంగాణ | 36 cr |
తమిళనాడు | 10.35 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా | 6.65 cr |
ఓవర్సీస్ | 16.47 cr |
వరల్డ్ టోటల్ | 69.47 cr (షేర్) |
‘కుబేర’ (Kuberaa) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.58.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ.60 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 8 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా 2 వారాలకి గాను రూ.69.47 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.118.2 కోట్లు కొల్లగొట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.9.47 కోట్ల ప్రాఫిట్స్ ను బయ్యర్స్ కి అందించింది.