Kushboo: కమిట్మెంట్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన సీనియర్ నటి కుష్బూ!

  • September 2, 2022 / 03:42 PM IST

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏ విధమైనటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకపోతే ఇండస్ట్రీలో అవకాశాలను అందుకొని ముందుకు కొనసాగడం ఎంతో కష్టతరం.ఇక హీరోయిన్ కైతే ఈ కష్టాలు మరింతగా ఉంటాయని చెప్పాలి.వారికి ఇండస్ట్రీలో అవకాశం వచ్చినప్పటికీ తదుపరి అవకాశాలను అందుకోవాలని ఇండస్ట్రీలో ఎన్నో ఇబ్బందులతో పాటు క్యాస్టింగ్ కౌచ్, కమిట్మెంట్ వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎంతోమంది హీరోయిన్లు ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నామంటూ

సోషల్ మీడియా వేదికగా కెరియర్ మొదట్లో వారికి ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. ఈ క్రమంలోనే తాజాగా సీనియర్ నటి కుష్బూ సైతం తనను కూడా ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగారంటూ షాకింగ్ కామెంట్ చేశారు.తెలుగు తమిళ భాషలలో హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కుష్బూ వెంకటేష్ హీరోగా తెరకెక్కిన కలియుగ పాండవులు సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యారు. మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించిన కుష్బూ అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగారు.

అయితే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనని టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో కమిట్మెంట్ అడిగారంటూ షాకింగ్ కామెంట్ చేశారు.ఇలా స్టార్ హీరో తనని కమిట్మెంట్ అడిగినప్పుడు తనకు చాలా కోపం వచ్చిందని అయితే వెంటనే తాను కూడా మీ కూతురిని నా తమ్ముడు దగ్గరకు పంపిస్తే మీకు కమిట్మెంట్ ఇస్తా అంటూ దిమ్మతిరిగేలా సమాధానం చెప్పారని వెల్లడించారు.

ఇలా తాను చెప్పిన సమాధానంతో ఆ హీరో అప్పటినుంచి తనతో చాలా సభ్యతగా ప్రవర్తించేవాడని ఈ సందర్భంగా కుష్బూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి ఆ టాలీవుడ్ హీరో ఎవరు అనే విషయం మాత్రం ఈమె బయట పెట్టలేదు.ఇక ఈమె కెరియర్ విషయానికొస్తే ప్రస్తుతం పలు సినిమాలలో మదర్ క్యారెక్టర్ లో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus