ఖాకీ డ్రస్సుల్లో కైపెక్కించిన అందమైన భామలు

పోలీస్ ఆఫీసర్ పాత్ర అంటే చాలా పవర్ ఫుల్ గా ఉంటుంది. అందుకే వీటిని ఎక్కువగా హీరోలే పోషించేవారు. యాక్షన్ సీన్స్ చేయాల్సి ఉంటుందని ముద్దుగుమ్మలు వెనుకడుగేసేవారు. క్రమంగా కథల్లో మార్పులు కారణంగా శారద, విజయశాంతి తదితరులు పోలీస్ ఆఫీసర్ పత్రాలు పోషించి శెభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు హీరోయిన్స్ ఖాకీ డ్రస్సులు వేస్తున్నారు. విలన్స్ భరతం పట్టడానికి కాదు.. హీరోలను ప్రేమలోకి దింపడానికి. అలా పోలీస్ ఆఫీసర్ డ్రస్సుల్లో కైపెక్కించిన అందమైన భామలపై ఫోకస్..

టబు కింగ్ నాగార్జున పోలీస్ ఆఫీసర్ గా నటించిన “ఆవిడా మా ఆవిడే” చిత్రంలో టబు పోలీస్ ఇన్ స్పెక్టర్ పాత్రల్లో నటించింది. ఖాకీ డ్రస్సులో టబు చాలా అందంగా ఉంటుంది.

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ యువరాణి కాజల్ అగర్వాల్ తెలుగు సినిమాల్లో పోలీస్ గా కనిపించలేదు. తమిళంలో విజయ్ హీరోగా నటించిన “జిల్లా” చిత్రంలో పోలీస్ పాత్రలో కాజల్ బాగా నవ్వించింది.

ప్రియాంక చోప్రా రామ్ చరణ్ తేజ్ హిందీలో నటించిన జంజీర్ సినిమాలో ప్రియాంక చోప్రా పోలీస్ డ్రస్సులో ఒక పాటలో డ్యాన్స్ చేసింది. ఖాకీ డ్రస్సులో చాలా హాట్ గా కనిపించింది.

అనుష్క శెట్టి స్వీటీ అనుష్క అనేక పాత్రల్లో కనిపించింది. లేడీ ఓరియెంటెడ్ మూవీలతో అదరగొట్టింది. తొలిసారి కార్తీ శకుని మూవీలో సబ్ ఇన్ స్పెక్టర్ గా గెస్ట్ రోల్ చేసింది. ఖాకీ డ్రస్సులో ఆమె లవ్ ప్రపోజ్ చేసే సన్నివేశం అభిమానులకు తెగ నచ్చింది.

శృతి హాసన్ మల్టీ ట్యాలెంటెడ్ గర్ల్ శృతి హాసన్ సాధారణ డ్రస్సుల్లోనే చాలా హాట్ గా కనిపిస్తుంది. ఆమె షాట్ పోలీస్ డ్రస్సులో మరింత హాట్ గా ఉంటుంది. ఇంతకీ ఏ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా నటించింది అనుకుంటున్నారా?.. పోలీస్ రోల్ చేయలేదు తమిళం వేదలమ్ మూవీలో ఒక పాటలో బ్లు యూనిఫామ్లో మాతో పోగొట్టింది.

రాశీఖన్నా ఢిల్లీ బ్యూటీ రాశీఖన్నా చాలా బబ్లీగా అంటుంది. ఆమె సాయి ధరమ్ తేజ్ సుప్రీమ్ పోలీస్ గా నవ్వించింది. కవ్వించింది. అందాలతో హీరోని ముగ్గులోకి దింపింది.

శృతి సోదినందమూరి కళ్యాణ్ రామ్ పటాస్ మూవీలో పోలీస్ అధికారిగా అదరగొట్టారు. అతనికి జోడీగా నటించిన శృతి సోది పోలీస్ యూనిఫామ్లో కనిపించి కిక్ ఇచ్చింది. అరెవో సాంబ పాటలో శృతి సోది యమా హాట్ గా కనిపించింది.

అనసూయగతేడాది హిట్ చిత్రాల జాబితాలో చేరిన క్షణం మూవీలో అనసూయ పోలీసాఫీసర్ క్యారెక్టర్లో సత్తా చాటింది. ఇది నెగిటివ్ రోల్ అయినప్పటికీ ఆమె, స్టైల్ నటనకి ప్రతి ఒక్కరూ ఫిదా కావాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus