సోషల్ మీడియాలో సిల్వర్ స్క్రీన్, స్మాల్ స్క్రీన్ అనే తేడా లేకుండా సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న న్యూస్.. పిక్స్ లేదా వీడియోస్, రీల్స్ వంటివి బాగా వైరల్ అవుతుంటాయి.. రీసెంట్గా టాలీవుడ్ యాంకర్ లాస్య తన భర్త మంజునాథ్ బర్త్‌డేని సెలబ్రేట్ చేసింది.. లాస్య హోలీ రోజున (మార్చి 8) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.. కలర్స్‌తో ఓ బ్యూటిఫుల్ వీడియోను షేర్ చేస్తూ ఈ గుడ్ న్యూస్ చెప్పారు లాస్య కపుల్..
ఇదిలా ఉంటే.. మార్చి 16న లాస్య హస్బెండ్ మంజునాథ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, లాస్య ఫ్యాన్స్, నెటిజన్స్ ఆయనకు విషెస్ తెలియజేస్తున్నారు.. డెలివరీ తర్వాత లాస్య నెటిజన్లకు కనిపించడం ఇదే మొదటి సారి.. దీంతో ఆ మూమెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.. కేక్ కటింగ్, విషెస్ చెప్తున్న పిక్స్, వీడియోస్ తమ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పోస్ట్ చేశారు లాస్య దంపతులు.. 1.7 మిలియన్ల మంది లాస్యను ఫాలో అవుతున్నారు..