బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న ‘ఆదిపురుష్’ సినిమా కొత్త షెడ్యూల్ ను గతంలో హైదరాబాద్ లో ప్లాన్ చేశారు. ముంబైలో లాక్ డౌన్ కావడంతో షూటింగ్ ను హైదరాబాద్ కు షిఫ్ట్ చేశారు. కానీ అదే సమయంలో హైదరాబాద్ లో కూడా లాక్ డౌన్ పెట్టారు. దీంతో షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు లాక్ డౌన్ లో సడలింపులు వచ్చిన తరువాత హైదరాబాద్ లో ‘ఆదిపురుష్’ రెండో షెడ్యూల్ మొదలుపెట్టాలని ప్లాన్ చేశారు.
ఈ క్రమంలో రామోజీ ఫిలిం సిటీలో ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే ఆ షెడ్యూల్ కంటే ముందుగానే ముంబైలో మరో చిన్న షెడ్యూల్ మొదలుపెట్టాలని నిర్ణయించింది యూనిట్. నటుడు సైఫ్ అలీ ఖాన్ కోసమే ఈ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రావణాసురుడిగా నటించనున్న సైఫ్.. హైదరాబాద్ షెడ్యూల్ లో జాయిన్ అవ్వాల్సివుంది. అయితే జూన్ 15 నుండి షూటింగ్స్ మొదలుపెట్టుకోవచ్చని మహారాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది.
దీంతో సైఫ్ అలీ ఖాన్ కూడా వెంటనే కాల్షీట్స్ అడ్జస్ట్ చేయడంతో.. అర్జెంట్ లో ముంబైలో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేశారు. సినిమా మొత్తం గ్రాఫిక్స్ తో ఉంటుంది కాబట్టి లొకేషన్ తో పని లేదు. ఇండోర్ లో గ్రీన్ మ్యాట్ తో షూటింగ్ చేస్తే సరిపోతుంది. అందుకే ముంబై లో స్టూడియోను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో కానీ.. హైదరాబాద్ షెడ్యూల్ లో కానీ రెండింటికీ ప్రభాస్ అవసరం లేదట. ప్రభాస్ తో సంబంధం లేని సన్నివేశాలను తెరకెక్కించనున్నారు.