టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి(Lavanya Tripathi) హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్, ఆన్‌లైన్ వేధింపులపై ఆమె సీరియస్ అయ్యారు.
తనను, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
‘పర్పుల్ క్రెయాన్ 00’ (Purple Crayon 00) అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా కొందరు ఉద్దేశపూర్వకంగా లావణ్యను టార్గెట్ చేశారట. ఆమె క్యారెక్టర్‌ను తప్పుబట్టేలా, నైతిక విలువలను ప్రశ్నిస్తూ అసభ్య కామెంట్లు, ఫేక్ ఆరోపణలతో వరుస పోస్టులు పెడుతున్నారు.ఇది తన మానసిక ప్రశాంతతను దెబ్బతీయడమే కాకుండా, తన ఫ్యామిలీ పరువుకు కూడా భంగం కలిగిస్తోందని లావణ్య తన కంప్లైంట్‌లో ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే ఆ అకౌంట్ వెనుక ఉన్నవారిని పట్టుకుని యాక్షన్ తీసుకోవాలని, ఆ కించపరిచే పోస్టులను డిలీట్ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.లావణ్య కంప్లైంట్‌ను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు వెంటనే దర్యాప్తు స్టార్ట్ చేశారు. నిందితులపై ఐటీ యాక్ట్ సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 78, 79 కింద కేసులు నమోదు చేశారు.
ప్రస్తుతం డిజిటల్ ఆధారాలు, ఐపీ అడ్రస్ ద్వారా ఆ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను ఎవరు, ఎక్కడి నుంచి ఆపరేట్ చేస్తున్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.మరోవైపు లావణ్య మెయిన్ లీడ్‌లో నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘సతీ లీలావతి’ విడుదలకు సిద్ధంగా ఉంది.
ఈ సినిమా మార్చి 6న థియేటర్లలోకి రావాల్సి ఉంది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల రిలీజ్ పోస్ట్‌పోన్ అయింది. త్వరలోనే ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్‌ను మేకర్స్ అఫీషియల్‌గా అనౌన్స్ చేయనున్నారు.