రామ్‌చరణ్ – ఉపాసన ఇటీవల కవలలకు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే. ఓ పాప, బాబు తమ ఇంటికి రావడంతో మెగా ఫ్యామిలీ సంతోషంగ ఉంది. అభిమానులు అయితే సంబరాలు చేసుకున్నారు. ఈ క్రమంలో రామ్‌చరణ్ కాస్త ఇబ్బందిపడిన విషయం తెలిసిందే. అలా ఎంత ఇబ్బందిపడ్డాడో మనకు తెలియదు కానీ కొంత మంది అత్యుత్సాహగాళ్లు మాత్రం ఆ కుటుంబం మీద ఏదో ఒక కామెంట్ చేసి ఆనందం పొందుతున్నారు. వాటిపై పెద్దగా స్పందించకుండా కామ్‌గా ఉంది మెగా ఫ్యామిలీ. అయితే లావణ్య త్రిపాఠి మాత్రం తొలిసారి గట్టి కౌంటర్ ఇచ్చింది.
అది ఏ రేంజిలో పేలింది అంటే.. ఆ కౌంటర్ దెబ్బకు ఆ పోస్టు పెట్టిన జర్నలిస్ట్ ఆ పోస్టును డిలీట్ చేసి గమ్మునున్నాడు. ‘‘నేను ఇలాంటి పోస్టుల విషయంలో పెద్దగా పట్టించుకోను. అందుకే స్పందించను. కానీ నీ లాంటి వాడి నుండి ఇలాంటి పోస్టు ఊహించలేదు. ఈ పోస్టు చాలా పూర్ టేస్ట్. ఒక ఆనందకరమైన పరిస్థితుల్ని ఇలా ఇబ్బందికరంగా మారేలా చేస్తున్నారు. ఆయన (చిరంజీవి) తన కుటుంబంలో మహిళల్ని ఎలా ట్రీట్ చేస్తాను నీకు తెలియదు. ముఖ్యంగా మనవరాల్ని ఎలా కేర్ చేస్తారో తెలియదు. చాలా తక్కువమంది ఇలా ఉంటారు. ఆయన చేసిన దానిలో ఒక్క శాతం కూడా చేయని వాళ్లు ఉండరు. కాబట్టి ఆయన గురించి తెలియకుండా ఇలాంటి కామెంట్లు చేయడం సరికాదు’’ అని లావణ్య తన పోస్టులో రాసుకొచ్చింది.
దీంతో నెటిజన్ల నుండి లావణ్యకు మద్దతు లభిస్తోంది. సరైన సమాధానం ఇచ్చారు. చిరంజీవి గురించి తెలియకుండా ఇలా అనేవారికి లావణ్య భలే కౌంటర్ ఇచ్చింది అని మాట్లాడుకుంటున్నారు. తమిళనాడుకు చెందిన హరిచరణ్ పూడిపెద్ది అనే జర్నలిస్ట్‌కే ఈ కౌంటర్ పడింది. చరణ్ కవల పిల్లలు పుట్టిన విషయం గురించి, చిరంజీవి మాట్లాడిన వీడియో రీపోస్ట్ చేస్తూ అమ్మాయిల విషయంలో చిరంజీవి ఆలోచన చూడండి.. అబ్బాయి పుట్టి ఇంటికొస్తే చిరంజీవి ఫ్యామిలీ పడిన సంబరం.. క్లీంకార పుట్టినప్పుడు లేదు అని పోస్టులో రాశారు. ఇప్పుడు ఆ పోస్టు డిలీట్ చేశారనుకోండి.