Varanasi: రెండు పార్టులు, పురాణాలు.. ‘వారణాసి’పై రాజమౌళి క్లారిటీలు

‘వారణాసి’ సినిమా గురించి గత కొన్ని రోజులుగా చాలా పుకార్లు వస్తున్నాయి. సినమా నిడివి గురించి, రెండు భాగాలు అని, కథలో ట్విస్ట్‌లు ఇవని ఇలా చాలా మాటలు వినిపిస్తున్నాయి. మొన్నీమధ్య సినిమా రిలీజ్‌ డేట్‌ చెప్పిన తర్వాత ఇంకా ఎక్కువయ్యాయి ఈ రూమర్స్‌. వీటన్నింటికి సమాధానం చాలా రోజుల తర్వాత దొరుకుతుందేమో.. ఈ లోపు పుకార్ల షికార్లు కొనసాగుతాయి అని అనుకున్నారంతా. అయితే అనూహ్యంగా సినిమా టీమ్‌ కొన్ని వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. అందులో చాలా క్లారిటీలు వచ్చేశాయి.

Varanasi

నవంబరు రికార్డు చేసిన ఇంటర్వ్యూలోని వీడియోలు అవి. అందులో సినిమా గురించి చాలా వివరాలు చెప్పారు. మరోవైపు రాజమౌళి కూడా రీసెంట్‌గా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అందులో ఈ సినిమా గురించి క్లారిటీలు ఇచ్చారు. సినిమాల్లో పురాణాల పాత్ర ఎంత, సినిమా రెండు పార్టులు ఉంటుందా అనే క్లారిటీలు ఇచ్చేశారు. మొదట్లో ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలని అనుకున్నప్పటికీ, చివరికి ఆ ఆలోచనను విరమించుకున్నామని రాజమౌళి తెలిపారు. ‘వారణాసి’ సినిమా కేవలం ఒకే భాగంలా వస్తుందని, సుమారు మూడు గంటల నిడివి అనుకుంటున్నామని జక్కన్న క్లారిటీ ఇచ్చారు.

ఇక పురాణాలు, ఇతిహాసాల టచ్‌ గురించి మాట్లాడుతూ నా ప్రతి సినిమాకు రామాయణం, మహాభారతం నుండి స్ఫూర్తి పొందుతాను. ‘వారణాసి’ సినిమాకు మాత్రం రామాయణాన్ని స్ఫూర్తిగా తీసుకోవడమే కాదు అందులోని ఓ భాగాన్ని సినిమాలో పెట్టాం. రామాయణం, భారతం తీయాలనేది నా జీవితాశయం. అది ఇంత త్వరగా సాకారం అవుతుందని అనుకోలేదు. సుమారు 25 నిమిషాల పాటు రామాణ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండనున్నాయని చిత్రబృందం తెలిపింది.

రూ.1300 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాను కేఎల్‌ నారాయణ, కార్తికేయ కలసి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను 2027లో ఏప్రిల్‌ 7న విడుదల చేస్తామని చిత్రబృందం ఇటీవల ప్రకటించింది. మహేష్‌ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న విషయం తెలిసిందే.

బుల్లెట్ సునీల్…యమ స్టైలిష్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus