నటి లావణ్య త్రిపాటి హీరో వరుణ్ తేజ్ ని పెళ్లి చేసుకుని మెగా ఇంటి కోడలు అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఈమె మెగా ఇంటి కోడలుగా వెళ్లిన తర్వాత తాను నటించిన మిస్ ఫర్ఫెక్ట్ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం హాట్స్టార్ లో ప్రసారమవుతుంది. ఫిబ్రవరి రెండో తేదీ నుంచి ఈ సీరిస్ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఇక ఈ సిరీస్ మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె తన ఫ్యామిలీ గురించి కెరియర్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ప్రస్తుతం మెగా ఇంటి కోడలు అనే ట్యాగ్ తగిలించుకున్నటువంటి లావణ్య త్రిపాటికి కెరియర్ పరంగా చాలా కండిషన్స్ ఉన్నాయి అంటూ ఎన్నో వార్తలు వచ్చాయి. ఈ వార్తలు గురించి ఈమె స్పందించారు. నేను మెగా కోడలిని ఇలాగే ఉండాలి అలాగే ఉండాలి అనే కండిషన్స్ నాకు లేవు.
ఒక వ్యక్తిగా నటిగా నాకు కావాల్సినంత స్వేచ్ఛ ఉందని ఈమె తెలియజేశారు. ఇక నేను ఏదైనా ఒక ప్రాజెక్ట్ కమిట్ అయ్యాను అంటే అందుకు సంబంధించిన స్క్రిప్ట్ వరుణ్ తో చర్చించుకుంటానని గతంలో కూడా ఇలాగే తనకు చెప్పే దానిని అంటూ లావణ్య తెలిపారు. గతంలో ఎలాగ ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామని పెద్దగా మార్పు ఏమీ లేదు అంటూ తెలిపారు.
ఇక కెరియర్ పరంగా వచ్చిన అవకాశాలన్నింటినీ అందుకొని డబ్బు సంపాదించడం నాకు ముఖ్యం కాదు నేను చేసే పాత్ర ఏదైనా నాకంటూ గుర్తింపు తీసుకురావాలని ఆరాటపడతాను. తాను ఇప్పటివరకు నటించిన సినిమాలన్నీ కూడా నాకు అలాంటి గుర్తింపునే తీసుకువచ్చాయని లావణ్య తెలిపారు. ఇక ప్రస్తుతం (Lavanya Tripathi) ఈమె పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారి నిర్మాణంలో ఓ సినిమా చేస్తున్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.
అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!
మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!