Lavanya Tripathi: మెగా ఫ్యాన్స్ వదిన అని పిలవడంపై లావణ్య త్రిపాఠి రియాక్షన్ ఇదే!

  • February 6, 2024 / 11:21 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న హీరోయిన్లలో లావణ్య త్రిపాఠి ఒకరు. లావణ్య త్రిపాఠి తన సినీ కెరీర్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి తన నటనతో సత్తా చాటారు. మెగా కోడలు అయ్యాక కూడా సినిమాలు, వెబ్ సిరీస్ లలో మంచి పాత్రలను ఎంచుకుంటూ లావణ్య త్రిపాఠి ప్రశంసలు అందుకుంటున్నారు. లావణ్య త్రిపాఠి రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉంది. అయితే లావణ్య త్రిపాఠిని మెగా అభిమానులు ప్రేమగా వదిన అని పిలుస్తారు.

మెగా ఫ్యాన్స్ అలా పిలవడం సో స్వీట్ అని ఆమె చెప్పుకొచ్చారు. తన ఫ్యామిలీలో మాత్రం నిహారిక మాత్రమే నన్ను వదిన అని పిలుస్తారని ఆమె తెలిపారు. లావణ్య నటించిన మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ ప్రస్తుతం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. లావణ్య త్రిపాఠి రాబోయే రోజుల్లో మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్ లతో ముందుకు వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

మెగా ఫ్యామిలీ గురించి లావణ్య త్రిపాఠి మాట్లాడుతూ మెగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ నాతో ఎంతో ప్రేమగా వ్యవహరిస్తారని అన్నారు. ఆ కుటుంబానికి చెందిన అభిమానుల ప్రేమను సైతం పొందుతున్నానని ఆమె కామెంట్లు చేశారు. లావణ్య సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటున్నారు.

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ లో లావణ్య ప్రతి వస్తువు క్లీన్ అండ్ పర్ఫెక్ట్ గా ఉండాలని భావించే యువతిగా కనిపించారు. లవ్ అండ్ కామెడీగా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కగా బిగ్ బాస్ అభిజిత్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్ర పోషించారు. లావణ్య త్రిపాఠి నటిస్తున్న వెబ్ సిరీస్ లు ఆమె రేంజ్ ను మరింత పెంచుతున్నాయి. మెగా ఫ్యామిలీ సినిమాలలో (Lavanya Tripathi) లావణ్య త్రిపాఠి నటించాలని అభిమానులు ఫీలవుతున్నారు.

అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
బూట్‌కట్ బాలరాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus