టాలీవుడ్ కుర్ర హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటున్నాయి. టాలీవుడ్ కి చెందిన ఓ యంగ్ హీరోని ఆమె పెళ్లి చేసుకోబోతుందని టాక్. చాలా రోజులుగా ఈ ప్రచారం జరుగుతోంది. అయితే ఈసారి మాత్రం పెళ్లి చేసుకోవడం ఖాయమని అంటున్నారు. లావణ్య త్రిపాఠి తల్లిదండ్రులు డెహ్రాడూన్ లో ఉంటారు. వాళ్లది ఉత్తరప్రదేశ్ కి చెందిన బ్రాహ్మణ కుటుంబం. ఆ ఫ్యామిలీలో చాలా మంది లాయర్లు, సివిల్ సర్వెంట్స్ ఉన్నారు.
లావణ్య త్రిపాఠి మాత్రమే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చారు. హిందీ బుల్లితెరపై కెరీర్ మొదలుపెట్టి.. టాలీవుడ్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదిలా ఉండగా.. కొన్నాళ్లుగా ఈమె ఓ హీరోతో ప్రేమలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను ఆమె పెద్దగా ఖండించలేదు. అలా అని ఒప్పుకోలేదు కూడా. త్వరలోనే ఈ జంట పెళ్లి బంధంతో తమ రిలేషన్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లాలనుకుంటున్నారు. రీసెంట్ గా ఓ యంగ్ హీరో తండ్రి త్వరలోనే తమ కుమారుడి పెళ్లి ఉంటుందని చెప్పారు.
లవ్ మ్యారేజ్ అంటూ హింట్ కూడా ఇచ్చారు. అతడు ప్రేమించి అమ్మాయి లావణ్యనే అని తెలుస్తోంది. తాను ప్రేమలో ఉన్నట్లు ఏనాడూ లావణ్య త్రిపాఠి చెప్పలేదు. కానీ.. ప్రేమపై తన అభిప్రాయాన్ని మాత్రం ఇదివరకు ఓ సందర్భంలో చెప్పింది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనే కాన్సెప్ట్ ను నమ్మనని తెలిపింది. ఒక వ్యక్తిని ప్రేమించాలా..? వద్దా..?
అనేది అతడితో మాట్లాడి, కొంత సమయం గడిపితే కానీ చెప్పలేనని.. మాట్లాడడం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చింది. తనకు పెళ్లి మీద నమ్మకం ఉందని లావణ్య త్రిపాఠి తెలిపింది. ఈ బ్యూటీ చివరిగా ‘హ్యాపీ బర్త్ డే’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఒకప్పటితో పోలిస్తే ఈమెకి పెద్దగా అవకాశాలు రావడం లేదు. కాంపిటిషన్ పెరిగిపోవడంతో ఆమెకి ఛాన్స్ లు బాగా తగ్గాయి.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!