యంగ్ హీరో సుహాస్ మరోసారి పూర్తి స్థాయి వినోదంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన తాజా చిత్రం ‘హే భగవాన్’ ఫిబ్రవరి 20న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు గోపి ఆచార రూపొందించిన ఈ చిత్రాన్ని బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా శివాని నాగారం నటించడం వెనుక కారణం ఏంటో చూసేద్దాం రండి.
దర్శకుడి మాటల్లో చెప్పాలంటే, కథను మొదట నుంచే సుహాస్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారట. స్క్రిప్ట్ తయారీలో హీరో ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా, సెట్స్‌పై తన అభిప్రాయాలు పంచుకుంటూ టీమ్‌కు సపోర్ట్ చేశాడని తెలిపారు. సుహాస్‌కు కామెడీ ప్రధాన బలం కావడంతో, ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దారు. అయితే కేవలం నవ్వులు మాత్రమే కాకుండా, తండ్రి-కొడుకుల మధ్య భావోద్వేగాలను కూడా ఎమోషనల్ గా డిజైన్ చేశారట దర్శకుడు.
ఇక శివానీని హీరోయిన్‌గా ఎంపిక చేయడానికి ప్రధాన కారణం ఆమె, సుహాస్ కాంబినేషన్‌కి వచ్చిన పాజిటివ్ రెస్పాన్స్. గతంలో ఈ జంట కలిసి నటించిన ‘అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్’ మంచి పేరు తెచ్చుకోవడంతో, ప్రేక్షకుల్లో ఇప్పటికే గుర్తింపు పొందిన పెయిర్‌ను కొనసాగించాలని టీమ్ నిర్ణయించిందట. అందుకే శివానీ ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చారని సమాచారం.
చాలా తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేసిన ఈ చిత్రం కుటుంబ సమేతంగా చూసేలా రూపొందించామని దర్శకుడు స్పష్టం చేశారు. ప్రారంభం నుంచి ప్రీ-క్లైమాక్స్ వరకు నవ్వులు పూయిస్తూ, చివర్లో ఎమోషనల్ టచ్ ఇచ్చేలా కథను మలిచారట. ఇటీవల విడుదలైన ‘లిటిల్ హార్ట్స్’ బ్లాక్‌బస్టర్ విజయంతో శివానీకి మంచి గుర్తింపు వచ్చింది. ఆ చిత్రంలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇప్పుడు ‘హే భగవాన్’తో మరో హిట్ అందుకుంటుందా అన్న ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది.