Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Reviews » Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

  • October 10, 2026 / 12:57 PM ISTByFilmy Focus Desk
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Cast & Crew

  • హ‌ర్ష చెముడు (Hero)
  • ఐశ్వర్య హోలక్కల్ (Heroine)
  • హైప‌ర్ ఆది, జీవ‌న్ కుమార్‌, శ్రావ్య చౌద‌రి, శ్రీవిద్య‌ త‌దిత‌రులు... (Cast)
  • బాబు డేగల (Director)
  • చవాన్, శ్రీధర్ చెని , దీపక్ ముస్త్యాల (Producer)
  • అజ‌య్ అర‌సాడ‌ (Music)
  • శక్తి అరవింద్ (Cinematography)
  • లికిత్ లీ (Editor)
  • Release Date : 9th అక్టోబ‌ర్‌ 2026
  • వ‌యోన ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (Banner)

టాలీవుడ్ క‌మెడియ‌న్ హ‌ర్ష‌చెముడు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన “లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” వెబ్‌సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీతో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. ఈ సిరీస్‌కు జ‌బ‌ర్ధ‌స్థ్ ఫేమ్ బాబు డేగ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఐశ్వ‌ర్య హోల‌క్క‌ల్, హైప‌ర్ ఆది, జీవ‌న్ కుమార్ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఫ‌న్ ల‌వ్‌స్టోరీగా రూపొందిన సిరీస్ ఎలా ఉంది? ఈ వెబ్‌సిరీస్‌తో హ‌ర్ష‌, హైప‌ర్ ఆది తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేశారా? లేదా? అంటే?

Least Eligible Bachelor Review

Least Eligible Bachelor Web-Series Review and Rating

కథ: ప‌ల్నాడు జిల్లాలోని రెంట‌చింత‌ల ఊరికి చెందిన శ్రీనివాస‌రావుకు డ‌బ్బు, ప‌ర‌ప‌తి ఉంటాయి. కానీ కొడుకు తేజకు (హ‌ర్ష చెముడు) పెళ్లి కావ‌డం లేద‌నే బెంగ అత‌డిని ప‌ట్టిపీడిస్తుంది. ఊళ్లో ఏ అమ్మాయి అత‌డిని పెళ్లి చేసుకోవ‌డానికి ఒప్పుకోదు. పెళ్లి కావాలంటే ఉద్యోగం ఉండాల‌ని స్నేహితుడు ఇచ్చిన స‌ల‌హాతో హైద‌రాబాద్ వ‌స్తాడు. వ‌యోన అనే సాఫ్ట్‌వేర్ కంపెనీలో జాబ్ వ‌స్తుంది. ఆఫీస్‌లో తేజ‌కు టీమ్ లీడ్‌గా మ‌ధు (ఐశ్వ‌ర్య హోల‌క్క‌ల్‌) ప‌నిచేస్తుంటుంది. ఎలాగైనా అమెరికా వెళ్లాల‌నే ప్ర‌య‌త్నాల్లో ఉంటుంది. అనుకోని ప‌రిస్థితుల్లో తేజ‌తో క‌లిసి ఒకే ఫ్లాట్‌లో మ‌ధు ఉండాల్సివ‌స్తుంది. అదే సాఫ్ట్‌వేర్ కంపెనీలో మేనేజ‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు నాయుడు (జీవ‌న్ కుమార్‌).

త‌న ఆఫీస్‌లోనే ప‌నిమ‌నిషిగా వ‌ర్క్ చేసు సునీత‌ను ప్రేమిస్తుంటాడు. ఆ విష‌యం ఆమెకు చెప్ప‌డానికి భ‌య‌ప‌డుతుంటాడు. గోపీ (హైప‌ర్ ఆది)టీమ్ లీడ‌ర్‌. త‌నకింద ప‌నిచేసే అనూష‌ను(శ్రావ్య చౌద‌రి) ఎప్పుడూ తిడుతుంటాడు. గోపి ఓ మోడ‌ల్‌తో ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆ మోడ‌ల్‌…అనూష ఒక్క‌రే అనే నిజం అత‌డికి తెలిసిందా? తేజ‌, మ‌ధు ఒకే ఫ్లాట్‌లో ఉండ‌టానికి కార‌ణ‌మేమిటి? తేజ‌ను పెళ్లిచేసుకుంటాన‌ని చెప్పిన మ‌ధు అత‌డిని వ‌దిలేసి అమెరికా వెళ్లిపోయిందా? నాయుడు ప్రేమ‌ను సునీత అర్థం చేసుకుందా? అన్న‌దే ఈ వెబ్‌సిరీస్ క‌థ‌.

Least Eligible Bachelor Web-Series Review and Rating

న‌టీన‌టుల ప‌నితీరు: తేజ అనే పాత్ర‌లో హ‌ర్ష‌చెముడు కామెడీ టైమింగ్ బాగుంది. త‌క్కువ డైలాగ్స్ ఎక్కువ ఎక్స్‌ప్రెష‌న్స్‌తో ఎంట‌ర్‌టైన్‌చేశాడు. ఇంట‌ర్వ్యూ ఎపిసోడ్‌, తండ్రితో క‌లిసి అమ్మాయికి సైట్ కొట్టే సీన్ హిలేరియ‌స్‌గా ఉన్నాయి. సిరీస్ మొత్తానికి కామెడీ ప‌రంగా హైప‌ర్ ఆది బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచాడు. అత‌డి పంచ్‌లు నాన్‌స్టాప్‌గా న‌వ్విస్తాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల క‌ష్టాలు, గొప్ప‌త‌నం గురించి చెప్పే ఎమోష‌న‌ల్ సీన్‌లో అత‌డి న‌ట‌న బాగుంది. సాఫ్ట్‌వేర్ గురించి ఏం తెలియని మేనేజ‌ర్ పాత్ర‌లో జీవ‌న్ కుమార్ పాత్ర‌ను ఫ‌న్నీగా రాసుకున్నారు డైరెక్ట‌ర్‌.

మ‌ధు పాత్ర‌లో ఐశ్వ‌ర్య హోల‌క్క‌ల్ సెటిల్డ్ యాక్టింగ్‌ను క‌న‌బ‌రిచింది. హైప‌ర్ ఆది, అనూష పాత్ర చేసిన శ్రావ్య చౌద‌రి కాంబినేష‌న్ వ‌చ్చే ప్ర‌తి సీన్ నుంచి కామెడీ బాగా జ‌న‌రేట్ అయ్యింది. జీవ‌న్ కుమార్‌కు జోడీగా శ్రీవిద్య నాచుర‌ల్ యాక్టింగ్‌తో మెప్పించింది. హ‌ర్ష‌చెముడు తండ్రిపాత్ర‌ధారి ప్ర‌స్టేష‌న్ వినోదాన్ని పంచిన బూతులు ఎక్కువ‌య్యాయి.

Least Eligible Bachelor Web-Series Review and Rating

సాంకేతిక వ‌ర్గం ప‌నితీరు: “లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” కోసం బాబు డేగ‌ల రాసుకున్న క‌థ కొత్త‌దేమీ కాదు. ఈ పాయింట్‌తో గ‌తంలో చాలా సినిమాలు వ‌చ్చాయి. ట్రీట్‌మెంట్ విష‌యంలో డిఫ‌రెంట్‌గా ఆలోచించాడు. జెన్‌జీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యేలా సాఫ్ట్‌వేర్ బ్యాక్‌డ్రాప్‌ను ఎంచుకోవ‌డం సిరీస్‌కు ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. కామెడీ ఆరంభంలో బాగున్నా….పోను పోను త‌గ్గుతూ వ‌చ్చింది. కీల‌క‌మైన మ‌ధు, తేజ ల‌వ్‌స్టోరీని ఇంకాస్త డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.

వెబ్‌సిరీస్ అయినా ఇందులో పాట‌లు ఉన్నాయి. ట్రిప్ సీన్‌లో వ‌చ్చే పాట మెలోడీ ప్ర‌ధానంగా బాగుంది. బీజీఎమ్ కూడా ఓకే. శ‌ర్తి అర‌వింద్ సినిమాటోగ్ర‌ఫీ సినిమా స్థాయిలో ఉంది. నిర్మాణ విలువ‌లు కూడా ప‌ర్వాలేదు.

Least Eligible Bachelor Web-Series Review and Rating

విశ్లేష‌ణ‌: మూడు జంట చుట్టూ సాగే క‌థ‌తో “లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” సాగుతుంది. ప్రేమ‌, పెళ్లితో పాటు ఉద్యోగ జీవితంలో వారు ప‌డే క‌ష్టాల‌ను వినోదాత్మ‌కంగా ఈ సిరీస్‌లో చూపించారు డైరెక్ట‌ర్ బాబు డేగ‌ల‌. సెంటిమెంట్‌, ఓవ‌ర్ ఎమోష‌న్స్ లేకుండా ప్ర‌తి సీన్ నుంచి కామెడీని రాబ‌ట్టుకోవ‌డానికే ప్ర‌య‌త్నించారు.

సాఫ్ట్‌వేర్ ఆఫీస్ సీన్ల‌లోని ఫ‌న్ ఈ సిరీస్‌ను కాపాడింది. క‌ర్స‌ర్ మిస్స‌య్యింద‌ని ఓ ఉద్యోగి మేనేజ‌ర్‌కు కంప్లైంట్ ఇవ్వ‌డం, ప్రాజెక్ట్ ఫైల్ పేర్ల గురించి గోపి, అనూష‌ మ‌ధ్య సాగే సంభాష‌ణతో పాటు హీరో ఇంట‌ర్వ్యూ ఎపిసోడ్ న‌వ్వించాయి. అదే టెంపో చివ‌రి వ‌ర‌కు ఉంటే బాగుండేది. పోనుపోను డోస్ త‌గ్గుతూ వ‌చ్చింది. అంత్యాక్ష‌రి ఎపిసోడ్‌, ట్రిప్ పేరుతో ద‌ర్శ‌కుడు సిరీస్‌ను సాగ‌దీసిన ఫీలింగ్ క‌లుగుతుంది. క్లైమాక్స్ కూడా ప్రెడిక్ట‌బుల్‌గా ఉంది.

మొత్తం ఆరు ఎపిసోడ్స్‌తో బాబు డేగ‌ల ఈ సిరీస్‌ను తెర‌కెక్కించారు. ప్ర‌తి ఎపిసోడ్ లెంగ్త్ ముప్పై నిమిషాలు…అంత‌కంటే ఎక్కువే ఉంది. క‌థ కోసం కాకుండా కామెడీ కోసం చూస్తే “లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” టైమ్‌పాస్ చేస్తుంది.

Least Eligible Bachelor Web-Series Review and Rating

ఫోక‌స్ పాయింట్‌: చాలా మంది క‌మెడియ‌న్లు ఉన్నా న‌వ్వులు మాత్రం కొన్నే..

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Aishwarya Holakkal
  • #Harsha Chemudu
  • #Hyper Aadhi
  • #Least Eligible Bachelor
  • #Roopa Shravya

Reviews

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Comrade Kalyan Review in Telugu: కామ్రేడ్ క‌ళ్యాణ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

trending news

1 hour ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

17 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

22 hours ago
Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

19 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

20 hours ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

21 hours ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

21 hours ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version