Legend Collections: ‘లెజెండ్’ కి 9 ఏళ్ళు ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

  • March 29, 2023 / 12:57 PM IST

నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను కాంబినేషన్లో ‘సింహా’ తర్వాత వచ్చిన చిత్రం ‘లెజెండ్’. ’14 రీల్స్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర కలిసి ఈ చిత్రంలో హీరోయిన్లుగా రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ లు హీరోయిన్లుగా నటించారు.దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం కనబరిచిన ఈ చిత్రంతో జగపతి బాబు విలన్ గా రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రంలో బాలయ్య – జగపతి బాబు మధ్య వచ్చే సన్నివేశాలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి.

థియేటర్లలో ఈ సీన్లకు విజిల్స్ పడటమే కాకుండా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించాయని చెప్పాలి. ఇక 2014 మార్చి 28న విడుదలైన ఈ చిత్రం(Legend) మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. నేటితో ఈ చిత్రం విడుదలై 9 ఏళ్ళు పూర్తి కావస్తోంది. ఈ నేపథ్యంలో ‘ #9YearsForBlockBusterLegend ‘ అనే హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కాబట్టి ఫుల్ రన్లో ‘లెజెండ్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :

నైజాం 9.41 cr
సీడెడ్ 8.40 cr
ఉత్తరాంధ్ర 3.68 cr
ఈస్ట్ 2.25 cr
వెస్ట్ 2.21 cr
గుంటూరు 4.14 cr
కృష్ణా 2.30 cr
నెల్లూరు 1.70 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 34.09 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 4.75 cr
ఓవర్సీస్ 1.55 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 40.39 cr (షేర్

‘లెజెండ్’ చిత్రానికి రూ.32 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ రూ.40.39 కోట్ల షేర్ ను రాబట్టి.. బయ్యర్స్ కి రూ.8.09 కోట్ల ప్రాఫిట్స్ ను అందించి సూపర్ హిట్ గా నిలిచింది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus