అక్కినేని అఖిల్ నుండి ఓ సినిమా వచ్చి అల్మోస్ట్ 3 ఏళ్ళు కావస్తోంది. అతని గత చిత్రం ‘ఏజెంట్’ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. అయితే ఇప్పుడు ‘లెనిన్'(Lenin) తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. జూలై 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి ‘వినరో భాగ్యము విష్ణుకథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించాడు. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ ‘అన్నపూర్ణ స్టూడియోస్’ సంస్థల పై సూర్యదేవర నాగవంశీ, నాగార్జున సంయుక్తంగా నిర్మించారు.
ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, పాటలు, ట్రైలర్ వంటివి ప్రామిసింగ్ గా అనిపించాయి. టీమ్ అయితే చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంది. అఖిల్ ఈసారి బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని చెబుతున్నారు. అఖిల్ కూడా ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తున్నాడు. అతను ఇంత రగ్డ్ గా కనిపించడం కూడా ఇదే మొదటిసారి. మరోవైపు తమిళ స్టార్ నటుడు భాగ్యరాజ్ నటించిన చివరి సినిమా కావడం కూడా ప్రత్యేకతని సంతరించుకుంది ‘లెనిన్’.
ఆల్రెడీ ఈ చిత్రాన్ని కొంతమంది సన్నిహితులకి, ఇండస్ట్రీ పెద్దలకి చూపించారు మేకర్స్. వాళ్ళు సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని తెలిపారు. వారి టాక్ ప్రకారం.. ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుందట. అఖిల్ ఇంట్రో సీన్, ఆ తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటాయట. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్ తో ఉంటుందట. వీరి మధ్య వచ్చే లవ్ సీన్స్ కొత్తగా అనిపిస్తాయట.
కథని మలుపుతిప్పేది కూడా వీరి ప్రేమ కథే అంటున్నారు. హీరోయిన్ పాత్రకి చాలా ప్రాముఖ్యత ఉంటుందట. సెకండాఫ్ లో కొన్ని షాకింగ్ ట్విస్టులు ఉంటాయట. అవి ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటాయని అంటున్నారు. మొత్తానికి ‘లెనిన్’ ఓ న్యూ ఏజ్ కమర్షియల్ డ్రామా అంటున్నారు. అఖిల్ కెరీర్ కి హెల్ప్ అయ్యే సినిమా అంటున్నారు. చూడాలి మరి రిలీజ్ రోజున ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో.