LEO: లియో మూవీ రికార్డ్ బుకింగ్స్ వెనుక అసలు కథ ఇదేనా?

  • October 18, 2023 / 08:29 PM IST

విజయ్ లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన లియో మూవీ బుకింగ్స్ విషయంలో జోరు చూపిస్తోంది. తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు సమానంగా ఈ సినిమాకు బుకింగ్స్ జరుగుతుండటం ఫ్యాన్స్ కు ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే లియో మూవీకి రికార్డ్ బుకింగ్స్ వెనుక మెగా ఫ్యాన్స్ సపోర్ట్ ఉందని తెలుస్తోంది. మెగా ఫ్యాన్స్ లియో మూవీ కచ్చితంగా హిట్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఫస్ట్ డే రికార్డ్ స్థాయిలో కలెక్షన్లు సాధించేలా మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం కష్టపడుతున్నారని తెలుస్తోంది.

లియో మూవీలో చరణ్ కామియో అని ప్రచారం జరగడంతో పాటు వేర్వేరు కారణాల వల్ల ఈ సినిమాకు బుకింగ్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని తెలుస్తోంది. లియో మూవీ బుకింగ్స్ విషయంలో ఫ్యాన్స్ సైతం సంతోషంగా ఉన్నారు. లియో మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు 100 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. లియో మూవీ టైటిల్ వివాదంలో చిక్కుకోగా నాగవంశీ ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించుకున్నారని భోగట్టా.

ఎలాంటి అడ్డంకులు లేకుండా ఈ సినిమా రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజ్ కానుంది. విజయ్ కోరుకున్న భారీ బ్లాక్ బస్టర్ హిట్ లియో మూవీతో లభించడం ఖాయమని ఇందుకు సంబంధించి ఎలాంటి సందేహం అవసరం లేదని తెలుస్తోంది. త్రిషకు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకమని చెప్పవచ్చు. విజయ్, త్రిష ఈ సినిమాతో మరోమారు బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ ను క్రియేట్ చేస్తారేమో చూడాలి.

ప్రభాస్ లోకేశ్ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో ఒక సినిమా తెరకెక్కనుండగా (LEO) ఈ సినిమా లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ తో సంబంధం లేకుండా తెరకెక్కనుందని తెలుస్తోంది. లోకేశ్ కనగరాజ్ భవిష్యత్తు సినిమాలన్నీ అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ నయనీ పావని గురించి 10 ఆసక్తికర విషయాలు!

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!
‘బిగ్ బాస్ 7’ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అశ్విని శ్రీ గురించి 10 ఆసక్తికర విషయాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus