Vijay Devarakonda: ‘లైగర్‌’ ప్రచారంలో విజయ్‌ స్టైల్‌ ప్రచారం!

‘లైగర్‌’ సినిమా ప్రచారం ఫుల్‌ జోష్‌లో సాగుతోంది. అదేంటి విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌, అనన్య పాండే ఎక్కడా కనిపించడం లేదే. నిర్మాత ఛార్మి సందడి కూడా లేదే అని అంటారా. నిజమే మీరు చెప్పింది. ప్రచారం జరుగుతోంది టాలీవుడ్‌లో కాదు, బాలీవుడ్‌లో కాబట్టి. ఈ సినిమా ప్రచారాన్ని బాలీవుడ్‌ స్థాయిలో ప్రస్తుతం నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా సినిమా ప్రచారం కోసం టీమ్‌ తిరుగుతోంది. ఈ క్రమంలో శనివారం పట్నా వెళ్లారు. అక్కడి ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మరాయి.

పట్నాలోని ఫేమస్ అయిన ‘గ్రాడ్యుయేట్ ఛాయ్ వాలా’ టీమ్‌ను కలసి వారితో కాసేపు మాట్లాడాడు విజయ్‌ దేవరకొండ. ఆ ఫొటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గ్రాడ్యుయేట్‌తో క్రాస్‌ బ్రీడ్‌ అంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. ‘లైగర్‌’ సినిమాకు సాలా క్రాస్‌బ్రీడ్‌ అనేది ట్యాగ్‌లైన్‌ అనే విషయం తెలిసిందే. గ్రాడ్యుయేట్‌ ఛాయ్‌ వాలాతో లైగర్‌ కాసేపు ముచ్చటించి, కలసి టీ తాగి తన సినిమా ప్రమోషన్స్ చేశాడు.

‘లైగర్‌’ సినిమాను ఆగస్టు 25న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళంలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో సినిమా విడుదల దగ్గర్లో సెన్సార్‌ పూర్తి చేసి ఇబ్బంది పడకుండా ముందుగానే సెన్సార్‌ పనులు పూర్తి చేశారట పూరి జగన్నాథ్‌ అండ్‌ కో. ‘లైగర్‌’ సినిమాకు యు / ఎ సర్టిఫికెట్ లభించిందట. సినిమా నిడివి 2 గంటల 20 నిమిషాలు ఉందట. ఫస్ట్ హాఫ్ 75 నిమిషాలు ఉండగా, సెకండాఫ్ ఒక గంట ఐదు నిమిషాలు మాత్రమే ఉందట. ఈ సినిమా మిక్స్‌డ్‌ మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిందనే విషయం తెలిసిందే.

ఆ లెక్కన సినిమాలో ఫైట్లు ఎక్కువగానే ఉంటాయని అంచనా వేయొచ్చు. సినిమాలో మొత్తం ఏడు ఫైట్లు, ఆరు పాటలు ఉన్నాయని సమాచారం. విజయ్ దేవరకొండ సరసన అనన్యా పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్‌ను కీలక పాత్రలో తీసుకున్నారు. ఇక రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రధారి. ఇక ఈ సినిమా క్లైమాక్స్‌లో టైసన్‌, విజయ్‌ మధ్య ఫైట్‌ హైలైట్‌గా ఉంటుంది అంటున్నారు. అలాగే లేడీ బాక్సర్లతో విజయ్‌ ఫైట్‌ కూడా స్పెషల్‌ అట్రాక్షన్ అట.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus