LIK Collections: వీకెండ్ తర్వాత స్లీపేసిన ‘ఎల్ ఐ కె’
- April 19, 2026 / 01:29 AM ISTByPhani Kumar
‘లవ్ టుడే’ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో ప్రదీప్ రంగనాథన్ టాలీవుడ్లో కూడా సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. అందువల్ల ‘డ్యూడ్’ కి నెగిటివ్ టాక్ వచ్చినా బాగానే ఆడింది. ఇప్పుడు ‘ఎల్.ఐ.కె’ (LIK) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. నయనతార కూడా ఓ నిర్మాత కావడం విశేషం. వాస్తవానికి 6 నెలల క్రితమే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉంది.
LIK Collections

కానీ కొన్ని కారణాల వల్ల ఆలస్యం అయ్యింది. ఇప్పట్లో ఈ సినిమా విడుదల ఉండదు అని అంతా అనుకున్నారు. కానీ ఏప్రిల్ 10 కి సడన్ ఎంట్రీ ఇచ్చింది. కానీ మొదటి రోజు మొదటి షోతోనే నెగిటివ్ టాక్ మూటగట్టుకుంది. వసూళ్ళు కూడా ఆశించిన స్థాయిలో అయితే లేవు. వీకెండ్ కొంత వరకు ఓకే అనిపించినా.. వీకెండ్ తర్వాత బాగా డౌన్ అయ్యింది. ఒకసారి ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ను గమనిస్తే :
| తెలంగాణ | 1.62 cr |
| సీడెడ్ | 0.62 cr |
| ఆంధ్ర(టోటల్) | 1.38 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 3.62 cr(షేర్) |
‘LIK‘ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.6 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.6.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పెద్దగా బజ్ లేకుండా రిలీజ్ అయ్యింది ఈ సినిమా. నెగిటివ్ టాక్ ఎఫెక్ట్ వల్ల ఓపెనింగ్స్ అనుకున్న స్థాయిలో రాలేదు. వీక్ డేస్ లో మొత్తం చేతులెత్తేసింది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.3.62 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం రూ.2.88 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.















