నవాబ్ సినిమాకి మహేష్ కి లింక్ ఏమిటంటే?

డైరెక్టర్‌ మణిరత్నం టేకింగ్ అంటే స్టార్ హీరోలకు చాలా ఇష్టం. అందుకే అతనంటే ఇష్టపడుతుంటారు. తాజాగా అతని దర్శకత్వంలో వస్తున్న మూవీ నవాబ్. అరవింద స్వామి, శింబు హీరోలుగా నటించిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తోంది. ఇందులో ప్రకాష్ రాజ్ కీలక రోల్ పోషించారు. మాఫియా నేపథ్యంలో సాగె సినిమాలో ప్రేమ, పగలను సమపాళ్లలో మేళవించారు. ఈ ట్రైలర్ చూసిన తర్వాత చాలామంది మహేష్ బాబు పేరుని ప్రస్తావిస్తున్నారు. మంచి సినిమాని వదులుకున్నారని చెబుతున్నారు. ఎందుకంటే.. మణిరత్నం రెండేళ్ల క్రితం ఒక మంచి కథ రాసుకొని మల్టీ స్టారర్ మూవీ చేయాలనీ అనుకున్నారు. తమిళ హీరో విజయ్, తెలుగు హీరో మహేష్ లను ఇందులో నటించాలని అనుకున్నారు.

సుహాసినితో కలిసి మహేష్ ని కలిసి మణిరత్నం కథ వినిపించారు. కథ నచినప్పటికీ మహేష్ ఒకే చెప్పలేదు. ఈ విషయాన్నీ మహేష్ కూడా స్పైడర్ మూవీ ప్రమోషన్లో చెప్పారు. “కోలీవుడ్ హీరో విజయ్ నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కలసి మణిరత్నం సినిమాలో నటిద్దామని అనున్నాం. కానీ కుదరలేదు” అని వివరించారు. మణిరత్నం కెరీర్ కొన్నాళ్లుగా బాగాలేదని ఉద్దేశంతో మహేష్ నో చెప్పినట్లు పుకార్లు కూడా కొన్నాళ్ళు వచ్చాయి. ఆ కసితోనే మణిరత్నం తన శిష్యుడైన అరవిందస్వామిని ఒప్పించారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టులోకి శింబు, అరుణ్ విజయ్, జ్యోతిక, ప్రకాష్ రాజ్ లాంటి ప్రతిభావంతుల్ని తీసుకున్నారు. కస్టపడి “నవాబ్” తెరకెక్కించారు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ అయిన తర్వాత నవాబ్ ని వదులుకున్నందుకు మహేష్ తప్పకుండా బాధపడుతారని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఎవరి అంచనా నిజమవుతుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus