రాశిఖన్నా తో అంతసేపు లిప్ – లాకా.. విజయ్?

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తతం ‘డియర్ కామ్రేడ్’ చిత్రంతో ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్దమవుతున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్రంతో పాటూ క్రాంతి మాధవ్ డైరెక్షన్లో కూడా ఓ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రంలో రాశీఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే ముద్దుల విషయంలో విజయ్ దేవరకొండ అస్సలు కాంప్రమైజ్ ఎవ్వడు. అందులోనూ కచ్చితంగా లిప్ లాప్ ఉండాల్సిందే. అందుకే అతన్ని బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మితో పోల్చి తెగ మీమ్స్ చేస్తుంటారు నెటిజన్లు . ఒక్క ‘పెళ్ళిచూపులు’ ‘టాక్సీవాలా’ తప్ప విజయ్ దేవరకొండ హీరోగా నటించిన చిత్రాలన్నిటిలోనూ లిప్ లాక్స్ ఉన్నాయి.

ఇక ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో లిప్ లాక్ ఉందని టీజర్ చూసిన ప్రతీ ఒక్కరికి అర్ధమవుతుంది. ఇక డైరెక్టర్ క్రాంతి మాధవ్ చిత్రంలో కూడా విజయ్, రాశిఖన్నా లకు ఓ గాఢముద్దు లిప్ లాక్ ఉందట. ఏదో ఒక 10 సెకండ్లు ఉండే లిప్ లాక్ కాదట.. ఏకంగా 2 నుండీ 3 నిముషాలు ఉంటుందట. పక్కా లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరో ముగ్గురు హీరోయిన్లు ఉంటారంట. ఏమైనా విజయ్.. రాశిఖన్నా కు అంతసేపు లిప్ లాక్ అంటే.. కుర్ర కారు రెచ్చిపోవడం ఖాయమని చెప్పొచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus