Anushka: ‘సింగం’ టు ‘బాహుబలి’… అనుష్క కెరీర్లో భారీ కలెక్షన్లు రాబట్టిన సినిమాల లిస్ట్..!

  • November 12, 2022 / 08:00 AM IST

స్వీటీ శెట్టి అలియాస్ అనుష్క శెట్టి..ఓ మోడల్ గా కెరీర్ ను ప్రారంభించిన ఈమె తర్వాత యోగా టీచర్ గా పనిచేసింది. మొదట్లో ఈమెకు సినిమాల్లోకి రావాలనే ఉద్దేశం లేదు. కానీ పూరి జగన్నాథ్, నాగార్జున, సోనూ సూద్ ల ప్రోత్సాహంతో సూపర్ సినిమాతో హీరోయిన్ గా మారింది. ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ అయినప్పటికీ తన డాన్స్ తో, గ్లామర్ తో ప్రేక్షకులను కట్టిపారేసింది ఈ బ్యూటీ. సెకండ్ హీరోయిన్ గా కెరీర్ ను స్టార్ట్ చేయడంతో ఈమెకు ఎక్కువ లైఫ్ ఉండదు అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత ‘మహానంది’ అనే చిత్రంలో ఈమె లీడ్ రోల్ పోషించింది. ఆ వెంటనే విష్ణు – సురేష్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘అస్త్రం’ మూవీలో కూడా లీడ్ రోల్ పోషించి రాజమౌళి కంట్లో పడింది. దీంతో తన ‘విక్రమార్కుడు’ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకున్నాడు రాజమౌళి. ఈ మూవీ అనుష్కకి పెద్ద బ్రేక్ ఇచ్చిన మూవీ అని చెప్పాలి. అక్కడి నుండి ఈమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని రాలేదు. వరుస హిట్లతో సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ‘అరుంధతి’ సినిమాతో అయితే లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. ఓ పక్క విమెన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూనే మరోపక్క పెద్ద హీరోల సినిమాల్లో కూడా నటిస్తున్న అనుష్క కెరీర్లో భారీ కలెక్షన్లు సాధించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈమె కెరీర్ లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సింగం(యముడు) :

సూర్య హీరోగా హరి దర్శకత్వంలో 2010లో వచ్చిన ఈ మూవీ రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.అనుష్క హీరోయిన్ గా నటించిన సినిమాల్లో ఇదే మొదటి రూ.100 కోట్ల మూవీ.

2) సింగం 2 :

సూర్య, హరి కాంబినేషన్లో ‘సింగం’ కి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీలో కూడా అనుష్క హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.136 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

3) లింగ :

రజినీకాంత్ హీరోగా(ద్విపాత్రాభినయం) కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో సోనాక్షి సిన్హాతో పాటు అనుష్క కూడా హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

4) ఎన్నై అరిందాల్ (ఎంతవాడు గాని) :

అజిత్ హీరోగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో త్రిషతో పాటు అనుష్క కూడా హీరోయిన్ గా నటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.102 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5) సింగం 3 :

సింగం(యముడు), సింగం 2 తర్వాత వాటికి కొనసాగింపుగా వచ్చిన ఈ మూవీలో సూర్య హీరోగా నటించగా హరి దర్శకత్వం వహించాడు. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.110 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

6) సైరా నరసింహారెడ్డి :

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ పాన్ ఇండియా మూవీకి సురేందర్ రెడ్డి దర్శకుడు. అనుష్క ఈ చిత్రంలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రను పోషించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7) ఊపిరి :

నాగార్జున, కార్తీ హీరోలుగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అనుష్క కూడా ముఖ్య పాత్ర పోషించింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

8) బాహుబలి ది బిగినింగ్ :

రాజమౌళి- ప్రభాస్- రానా కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో అనుష్క కూడా కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.500 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

9) బాహుబలి 2(బాహుబలి ది కన్క్లూజన్) :

రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో అనుష్క హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ.1700 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

10) ‘మిర్చి’ ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘రుద్రమదేవి’ వంటి సినిమాలు రూ.80 కోట్లకు పైగా కలెక్ట్ చేశాయి కానీ రూ.100 కోట్ల మార్క్ ను టచ్ చేయలేకపోయాయి.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus