‘దంగల్’ టు ‘సంజు’.. హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన హిందీ సినిమాల లిస్ట్..!

  • December 5, 2022 / 10:12 AM IST

2022 అనేది బాలీవుడ్ కు గడ్డుకాలం అని పేర్కొనాలి. ఎందుకంటే ఈ ఏడాది రిలీజ్ అయిన చాలా హిందీ సినిమాలు వీకెండ్ కే దుకాణం సర్దేశాయి. సౌత్ సినిమాల డామినేషన్ కూడా ఎక్కువైంది. కానీ ఒకప్పుడు ఇండియన్ సినిమాల్లో ఎక్కువ మార్కెట్ కలిగిన ఇండస్ట్రీగా బాలీవుడ్ గురించి చెప్పుకునే వారు. అనుకున్న బడ్జెట్ లో సినిమా చేయడం, అనుకున్న టైంలో రిలీజ్ చేయడం.. వాళ్లకు ఉన్న మంచి అలవాటు. కాదు కాదు గొప్ప అలవాటు. ఇప్పటికీ కూడా హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది హిందీ సినిమానే అనడంలో అతిశయోక్తి లేదు. కానీ లాక్ డౌన్ వచ్చాక పరిస్థితి తారుమారు అయిపోయింది. మళ్ళీ బాలీవుడ్ కు పూర్వ వైభవం రావాలని సౌత్ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. వాళ్ళు మనలా ఆలోచిస్తారా? లేదా? అన్నది తర్వాతి విషయం. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి.. ఇప్పటివరకు హిందీలో హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన 10 సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) దంగల్ :

ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ ఏకంగా రూ.1924 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేసింది. బాహుబలి2, ఆర్.ఆర్.ఆర్, కె.జి.ఎఫ్ 2 వంటి సినిమాలు ఈ నంబర్ ను టచ్ చేయలేకపోయాయి.

2) బజరంగీ భాయ్ జాన్ :

సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ ఏకంగా రూ.858 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. పోటీగా ‘బాహుబలి ది బిగినింగ్’ ఉన్నా ఈ మూవీ అస్సలు తగ్గలేదు.

3) సీక్రెట్ సూపర్ స్టార్ :

ఆమిర్ ఖాన్ కీలక పాత్రలో నటించి, నిర్మించిన ఈ మూవీ ఏకంగా రూ.830 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

4) పీకే :

ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.742 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

5) సుల్తాన్ :

సల్మాన్ ఖాన్ హీరోగా రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.614 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

6) సంజు :

సంజయ్ దత్ జీవిత కథతో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.580 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

7) టైగర్ జిందా హై :

సల్మాన్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.562 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

8) పద్మావత్ :

దీపికా పదుకోనె ప్రధాన పాత్రలో రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ లు కూడా కీలక పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.560 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

9) ధూమ్ 3 :

ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.545 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

10) వార్ :

హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ లు హీరోలుగా నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.460 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus