‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్ సోహెల్ గురించి మనకు తెలియని విషయాలు..!

Advertisement

‘బిగ్ బాగ్ 4’ లో సోహెల్ బాగా పాపులర్ అయ్యాడు. మొదట్లో కాస్త అగ్రెసివ్ గా కనిపించినా.. ఇప్పుడు చాలా ఇస్మార్ట్ గా గేమ్ ఆడుతున్నాడు. స్వయంగా హోస్ట్ నాగార్జునే ఇతన్ని ఇస్మార్ట్ సోహెల్ అన్నాడు అంటే అర్ధం చేసుకోవచ్చు.. ఇతను ఎంత యాక్టివ్ అనేది..! సోహెల్ అసలు పేరు సయ్యద్ సోహెల్ ర‌యాన్..! 1991 ఏప్రిల్ 18 న ఇతను కరీంనగర్ లో జన్మించాడు. సోహెల్ తండ్రి ఓ సింగరేణి కార్మికుడు. అందుకే వీకెండ్స్ లో నాగార్జున ఇతన్ని సింగ‌రేణి బిడ్డ అంటుంటాడు. ఇదిలా ఉండగా.. హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు సోహెల్ గురించి ప్రేక్షకులెవ్వరికీ పెద్దగా అవగాహన లేదు. ఇతను కూడా సెలబ్రిటీనా? అన్నట్టు నోర్లు వెల్లపెట్టారు.

అయితే పలు టీవీ సీరియల్స్ తో పాటు సినిమాల్లో కూడా నటించాడు సోహెల్.కానీ అవేమీ అతనికి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే సోహెల్ నటించిన సినిమాలు, సీరియల్స్ ఏంటో తెలుసుకుందాం రండి :

సోహెల్ నటించిన సినిమాలు :

1) కొత్త బంగారు లోకం (2008)

2) డి ఫర్ దోపిడి (2013)

3) మ్యూజిక్ మ్యాజిక్ (2013)

4) కవ్వింత (2015 )

5) థి బెల్స్ (2015)

6) పడ్డానండి ప్రేమలో మరి (2015 )

7) నిర్మలా కాన్వెంట్ (2016)

8) జనతా గ్యారేజ్ (2016)

9) సరైనోడు (2016)

10) పిచ్చిగా నచ్చావ్ (2017)

11) కొనాపురంలో జరిగిన కథ (2019)

12) యురేకా (2020)

సోహెల్ నటించిన సీరియల్స్ :

1) పసుపు కుంకుమ (2014)

2) నాతిచరామి (2017)

3) కృష్ణవేణి (2018)

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus