రిలీజ్ తర్వాత చాలా లేట్ గా టీవీల్లో ప్రదర్శింపబడిన సినిమాల లిస్ట్..!

గత కొన్నేళ్లుగా సినిమా విడుదలైన నెల లేదా రెండు నెలల్లోనే టీవీల్లో టెలికాస్ట్ అయిపోతున్నాయి. పెద్ద సినిమాలు అయితే రిలీజ్ అయిన 50 రోజుల నుండీ 100 రోజుల మధ్యలో టెలికాస్ట్ అవుతున్నాయి అనుకోండి.! సినిమా పై మంచి క్రేజ్ ఉంటే షూటింగ్ సమయంలోనే శాటిలైట్ రైట్స్ కు సంబంధించిన బిజినెస్ జరిగిపోతుంటుంది. అయితే కొన్ని సినిమాలకు మాత్రం శాటిలైట్ రైట్స్ కు సంబంధించిన బిజినెస్ లేట్ గా జరగడం వల్లనో ఏమో కానీ చాలా లేట్ గా టెలికాస్ట్ అయ్యాయి. మరికొన్ని సినిమాలు అయితే ఏళ్ళు గడిచినా ఇంకా టెలికాస్ట్ అవ్వలేదు. మరి ఆ సినిమాలేంటో ఓ లుక్కేద్దాం రండి :

1)ఎటో వెళ్ళిపోయింది మనసు :

నాని, సమంత జంటగా నటించిన ఈ చిత్రానికి గౌతమ్ మీనన్ దర్శకుడు. ఈ చిత్రం 2012న విడుదలైతే 2018 లో ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యింది.

2)ఐ :

విక్రమ్- శంకర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2015 లో విడుదలైతే 2020 లో(ఇటీవల) ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యింది.

3)జెండా పై కపిరాజు :

నాని, అమలా పాల్ జంటగా నటించిన ఈ చిత్రానికి సముద్ర ఖని దర్శకుడు. 2015 లో ఈ చిత్రం విడుదలైతే 2020(ఇటీవల) ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యింది.

4)సాహో :

‘బాహుబలి'(సిరీస్) తర్వాత ప్రభాస్ నటించిన ‘సాహో’ చిత్రం విడుదలయ్యి ఏడాది కావస్తున్నా ఇంకా టీవీల్లో టెలికాస్ట్ అవ్వలేదు.

5)కె.జి.ఎఫ్:

యష్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2018 డిసెంబర్ లో విడుదలైతే.. 2020 లో.. అదీ ఈ మధ్యనే ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యింది.

6) పరమ వీర చక్ర :

బాలకృష్ణ – దాసరి నారాయణ రావు కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం.. 2011 లో విడుదలైతే ఇంకా టీవీల్లో టెలికాస్ట్ అవ్వలేదు.

7) అధినాయకుడు :

బాలకృష్ణ – పరుచూరి మురళి కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం 2012 లో విడుదలైతే ఇంకా టీవీల్లో టెలికాస్ట్ అవ్వలేదు.

8)రుద్రమదేవి :

అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రుద్రమదేవి’ చిత్రాన్ని గుణశేఖర్ డైరెక్ట్ చెయ్యగా.. అల్లు అర్జున్ కీలక పాత్ర పోషించాడు. ఈ చిత్రం 2015 లో విడుదలైతే 2017 లో ఈటీవీలో టెలికాస్ట్ అయ్యింది.

9)ఘాజీ :

రానా హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం 2017 లో విడుదలవ్వగా.. ఇంకా టీవీల్లో టెలికాస్ట్ అవ్వలేదు.

10) ఆఫీసర్ :

నాగార్జున – రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం 2018 లో విడుదలవ్వగా.. ఇంకా టీవీల్లో టెలికాస్ట్ అవ్వలేదు.

11)అడవి :

నితిన్ – రాంగోపాల్ వర్మ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అడవి’ చిత్రం  2009 లో విడుదలైతే ఇప్పటికీ టీవీల్లో టెలికాస్ట్ అవ్వలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus