‘శివపురం’ టు ‘కడువా’.. తెలుగులో డబ్ అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాల లిస్ట్..!

  • June 27, 2022 / 03:34 PM IST

మలయాళం లో స్టార్ హీరో అయిన పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ మధ్యనే తెలుగులో కూడా పాపులర్ అవుతున్నాడు. అతను ఓ హీరోగా నటించిన ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ చిత్రం తెలుగులో ‘భీమ్లా నాయక్’ పేరుతో రిలీజ్ అవ్వగా.. అతను దర్శకత్వం వహించిన ‘లూసిఫర్’ చిత్రం తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయినప్పటికీ ఇప్పుడు రీమేక్ అవుతుంది. అలాగే అతను హీరోగా షాజీ కైలాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కడువా’ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కాబోతుంది.బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రంలో ‘భీమ్లా నాయక్’ లో రానా భార్యగా నటించిన సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించింది.

మలయాళం… తెలుగు తో పాటు తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా ‘ కడువా’ జూన్ 30న విడుదల కాబోతుంది. అంతేకాదు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘సలార్’ లో కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. గతంలో అతనికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’ లో కూడా అవకాశం వచ్చింది. కానీ అప్పుడు డేట్స్ ఖాళీ లేక నటించలేకపోయాడట. అలాగే ‘గాడ్ ఫాదర్’ ని డైరెక్ట్ చేసే అవకాశాన్ని మొదట పృథ్వీరాజ్ సుకుమారన్ కే ఇచ్చారు మెగాస్టార్. ఆ టైంలో కూడా డేట్స్ ఖాళీ లేక ఆ ఛాన్స్ మిస్ చేసుకున్నట్టు ఇటీవల ‘కడువా’ ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా… కరోనా లాక్ డౌన్ వల్ల పృథ్వీరాజ్ సుకుమారన్ సినిమాలు వరుసగా ఓటీటీలో రిలీజ్ అవ్వడం వలన అతను ఎక్కువ ఫేమస్ అయ్యాడు అని అంతా అనుకుంటున్నారు. కానీ గతంలో అతను నటించిన కొన్ని మలయాళం సినిమాలు తెలుగులో డబ్ అయ్యాయి. కానీ అప్పుడు తెలుగు ప్రేక్షకులు వాటిని పట్టించుకోలేదు. సరిగ్గా ప్రమోషన్ చేయకపోవడం వలనో ఏమో కానీ అవి టీవీలకి, యూట్యూబ్ కే పరిమితమయ్యాయి. సరే ఈ విషయాలను పక్కన పెట్టేసి తెలుగులో డబ్ అయిన పృథ్వీ రాజ్ సుకుమారన్ సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) సత్యం ఐపీఎస్ :

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా 2004 లో మలయాళంలో వచ్చిన ‘సత్యం’ చిత్రాన్ని తెలుగులో సత్యం ఐపీఎస్ పేరుతో విడుదల చేశారు. ప్రియమణి ఇందులో హీరోయిన్ గా నటించింది. వినయన్ ఈ చిత్రానికి దర్శకుడు.

2) శివపురం :

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా 2005 లో వచ్చిన ‘ఆనంద భద్రం’ అనే చిత్రాన్ని తెలుగులో శివపురం పేరుతో 2006 లో విడుదల చేశారు. ఇండియా వైడ్ టాప్ సినిమాటోగ్రాఫర్ లో ఒకరైన సంతోష్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు.

3) కర్తవ్యం :

పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్ర పోషించిన ‘కాన కండేన్’ అనే చిత్రం తెలుగులో ‘కర్తవ్యం’ పేరుతో రిలీజ్ అయ్యింది.దివంగత తమిళ స్టార్ దర్శకుడు కే.వి.ఆనంద్ ఈ చిత్రానికి దర్శకుడు.

4) ఏటీఎం :

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా 2009 లో రూపొందిన ‘రాబిన్ హుడ్’ చిత్రం తెలుగులో ‘ఏటీఎం’ పేరుతో రిలీజ్ అయ్యింది. జోషీ ఈ చిత్రానికి దర్శకుడు.

5) పోలీస్ వేట :

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా 2010లో తెరకెక్కిన ‘ది థ్రిల్లర్’ చిత్రం తెలుగులో ‘పోలీస్ వేట’ పేరుతో రిలీజ్ అయ్యింది. బి.ఉన్నికృష్ణన్ ఈ చిత్రానికి దర్శకుడు.

6) పోలీస్ పోలీస్ :

పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రీరామ్ కాంబినేషన్లో 2010లో వచ్చిన ఈ చిత్రం ‘పోలీస్ పోలీస్’ టైటిల్ తోనే తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. మన్మోహన్ చల్లా ఈ చిత్రానికి దర్శకుడు.

7) ఉరుమి :

పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం 2011 లో అదే టైటిల్ తో తెలుగులో రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి సంతోష్ శివన్ దర్శకుడు.

8) మరణ శాసనం :

పృథ్వీరాజ్ సుకుమారన్, శశి కుమార్ కాంబినేషన్లో 2012 లో వచ్చిన ‘మాస్టర్స్’ చిత్రం తెలుగులో ‘మరణ శాసనం’ అనే టైటిల్ తో రిలీజ్ అయ్యింది. జానీ ఆంటోనీ ఈ చిత్రానికి దర్శకుడు.

9) కోల్డ్ కేస్ :

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా 2021 లో వచ్చిన ‘కోల్డ్ కేస్’ చిత్రం అదే టైటిల్ తో తెలుగులో ‘ఆహా’ ఓటీటీ లో రిలీజ్ అయ్యింది.

10) లూసిఫర్ :

మోహన్ లాల్ హీరోగా నటించిన ఈ చిత్రానికి పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకుడు. అదే టైటిల్ తో ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది.

11) కడువా :

పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా షాజీ కైలాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కడువా’ చిత్రం మలయాళంతో పాటు తెలుగులో కూడా జూన్ 30న రిలీజ్ కాబోతుంది

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus