Lobo Remuneration: లోబోకి బిగ్ బాస్ ఇచ్చిన రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

  • November 2, 2021 / 02:18 PM IST

‘బిగ్ బాస్-5’ 6వ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన లోబో 8 వారాల వరకు ‘బిగ్ బాస్’ హౌస్ లో కొనసాగి మొన్ననే ఎలిమినేట్ అయ్యాడు. ‘బిగ్ బాస్’ కు రాకముందు ఇతని గురించి కొంతమందికి తెలిసుండొచ్చు కానీ.. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన తర్వాత మరింతగా పాపులర్ అయ్యాడు.హౌస్లో ఉన్నవాళ్ళనే కాకుండా అందరినీ ఎంటర్టైన్ చేస్తూ వచ్చిన లోబో….అసలు పేరు మహమ్మద్‌ ఖయ్యూం అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు.

ఇతను కెరీర్‌లో ఎంతో కష్టపడి పైకి వచ్చానని, బస్తీలో ఉండే కష్టాలన్నీ తాను అనుభవించానని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. గత వారం లోబోని ఫేక్ ఎలిమినేషన్ చేశారు. అప్పటివరకు ఎంతో యాక్టివ్ గా ఉన్న లోబో కొంచెం డల్ అయ్యాడనే ఉద్దేశంతో బిగ్ బాస్ అలా చేసుండొచ్చు. కానీ తర్వాత అతను నామినేషన్స్ లోకి వచ్చినా ప్రేక్షకులు అతనికి ఎక్కువ ఓట్లు వేయలేదు. ‘బిగ్ బాస్’ నిర్ణయమే కరెక్ట్ అని వారనుకున్నారనుకుంటాను.

ఈ విషయాలను పక్కన పెట్టేస్తే… ‘బిగ్ బాస్’ హౌస్‌లో 8 వారాలు కొనసాగినందుకు లోబోకు ఎంత పారితోషికం లభించి ఉండొచ్చు అనే ప్రశ్నలు ఇప్పుడు ఊపందుకున్నాయి.అందుతున్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ హౌస్‌లో లోబోకు ఒక్కరోజుకి గాను రూ.35 వేల రెమ్యునరేషన్ ఇచ్చారట. అంటే ఇన్ని రోజులు ఉన్నందుకు అతనికి రూ. 18 లక్షల పైనే అందినట్టు తెలుస్తుంది.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video



రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus