మరో నెలరోజుల్లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా విడుదల కాబోతుంది. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నాడు రిలీజ్ చేసిన టీజర్ లో సినిమా రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేశారు. అక్టోబర్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ షురూ చేయలేదు. మరోపక్క అదేరోజున విడుదల కానున్న నాగార్జున ‘ది ఘోస్ట్’ ట్రైలర్ తోనే అందరినీ ఇంప్రెస్ చేసింది.
అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకునేలా చేసింది. కానీ చిరు సినిమాకి మాత్రం సరైన బజ్ ను తీసుకురాలేకపోతున్నారు. అసలే చిరు లాస్ట్ సినిమా ‘ఆచార్య’ అభిమానులను నిరాశపరిచింది. ‘గాడ్ ఫాదర్’తో చిరు తమను ఎంటర్టైన్ చేస్తారని అభిమానులు నమ్ముతున్నారు. ఈ సినిమాలో ఫ్యాన్స్ కి కిక్కిచ్చే విషయాలు చాలానే ఉన్నాయి. సల్మాన్ ఖాన్ క్యామియో రోల్, చిరు-సల్మాన్ ల మధ్య ఒక సాంగ్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లు ఇవన్నీ ఫ్యాన్స్ ని ఓ రేంజ్ లో అలరిస్తాయని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
ఇదంతా బాగానే ఉంది కానీ ‘గాడ్ ఫాదర్’ సినిమా ప్రమోషన్స్ లో టీమ్ యాక్టివ్ గా కనిపించడం లేదు. ప్రమోషన్స్ లైట్ తీసుకుంటే రిజల్ట్ తారుమారయ్యే ఛాన్స్ ఉంది. మరో నెల రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి రిలీజ్ వరకు చేసుకోవాల్సిన ప్లానింగ్ చాలానే ఉంది. ప్రమోషన్స్ కారణంగానే మంచి ఓపెనింగ్స్ వస్తాయి. జనాలను థియేటర్లకు రప్పించడానికి మెగాస్టార్ తన స్వాగ్ తో మెస్మరైజ్ చేయాల్సిఉంటుంది. మరి దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమా ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారో చూడాలి!
Most Recommended Video
‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!