‘హరోం హర’ వంటి యాక్షన్ మూవీ తర్వాత సుధీర్ బాబు (Sudheer Babu) నుండి వచ్చిన ‘మా నాన్న సూపర్ హీరో'(Maa Nanna Superhero) . ‘వి సెల్యులాయిడ్స్’ ‘కామ్ ఎంటర్టైన్మెంట్’.. సంస్థల పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మించారు.అక్టోబర్ 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చినా.. బాక్సాఫీస్ వద్ద పెద్దగా సత్తా చూపలేదు.దసరా సెలవులను కూడా ఎంత మాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది ఈ సినిమా.
ఒకసారి (Maa Nanna Superhero) 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే:
నైజాం | 0.30 cr |
సీడెడ్ | 0.10 cr |
ఉత్తరాంధ్ర | 0.17 cr |
ఈస్ట్ | 0.08 cr |
వెస్ట్ | 0.05 cr |
గుంటూరు | 0.11 cr |
కృష్ణా | 0.14 cr |
నెల్లూరు | 0.04 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 0.99 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.09 cr |
వరల్డ్ వైడ్ టోటల్ | 1.08 cr |
‘మా నాన్న సూపర్ హీరో’ చిత్రానికి రూ.4.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.5.2 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా కేవలం రూ.1.08 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.4.12 కోట్ల షేర్ ను రాబట్టాలి.