ప్రస్తుతం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్ అంటే.. ప్రముఖ నిర్మాత నాగవంశీ (Naga Vamsi) మాటలే. కొన్ని వెబ్‌సైట్లకు ఆయన ఇటీవల వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అందులో ఆయన కావాలనే అంటున్నారా? లేక సందర్భానుసారం వస్తున్నాయో కానీ కొన్ని విషయాలు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. అలాంటి వాటిలో సంక్రాంతి సినిమాల రచ్చ ఒకటి. వచ్చే ఏడాది తమ సినిమాకు పోటీనే ఉండదు అని ఆయన ఇటీవల అనడమే కారణం. ఇంతకీ ఏమైందంటే.. నందమూరి బాలకృష్ణ – బాబీ దర్శకత్వంలో ఓ సినిమాను నాగవంశీ నిర్మిస్తున్నారు.
ఈ సినిమాను తొలుత డిసెంబరులో రిలీజ్ చేస్తారని వార్తలొచ్చినా.. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే సంక్రాంతి సీజనే బెటరు అని అనుకున్నట్లు అర్థమవుతోంది. ఈ క్రమంలో సంక్రాంతి సీజన్ పరిస్థితి ఏంటి అని ఆయన దగ్గర ప్రస్తావిస్తే.. సింపుల్‌గా ‘నాకు తెలిసి సంక్రాంతికి మాకు పెద్ద పోటీ ఉండకపోవొచ్చు’ అని అన్నారు. నిజానికి ఇప్పుడున్న లెక్కల ప్రకారం సంక్రాంతికి ఐదారు సినిమాలు బరిలో ఉన్నాయి.
అందులో రామ్‌చరణ్ – దిల్ రాజు – శంకర్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ ఉంది. మరోవైపు మైత్రీ మూవీ మేకర్స్ – అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ లాంటి పెద్ద సినిమా కూడా ఉంది. అయినా నాగవంశీ ‘మాకు పోటీ లేదు’ అని అనడంతో ఎందుకన్నారో అని అనుకుంటున్నారు సినిమా జనాలు. చరణ్ ఫ్యాన్స్ అయితే ‘గేమ్ ఛేంజర్’ సినిమాను అంత లైట్ తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
సంక్రాంతికి వచ్చే బాలయ్య సినిమాల విజయాల శాతం ఎక్కువగానే ఉండొచ్చు. కానీ మొత్తంగా పోటీయే లేదనేంత స్టేట్‌మెంట్ టూ హార్స్ అనేది చరణ్ ఫ్యాన్స్ మాట. మరి నాగవంశీ ఆలోచన ఏంటో ఆయనే చెప్పాలి. అన్నట్లు ఆయన టికెట్ ధరలు – వసూళ్లు – పోస్టర్లు గురించి చూసిన వ్యాఖ్యలు కూడా వైరల్‌గా మారి పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.