Alia Bhatt: తన సమస్య గురించి ఓపెన్‌ అయిన స్టార్‌ హీరోయిన్‌.. ఇలాంటి సమస్య..!

ఆందోళన.. ఇది అందరికీ ఉంటుంది. కొంతమంది ఆందోళన కాసేపు ఉంటుంది. ఇంకొంతమంది అసలు ఆ ఆందోళను ముఖంలో కనిపించనీయరు. మరికొంతమంది ఆందోళన ముఖంలో సులభంగా కనిపిస్తుంది. అయితే ప్రతి క్షణం ఆందోళన చెందే వ్యక్తులు కూడా ఉంటారా? మీకు కొంతమంది ఇలాంటి వ్యక్తులు కనిపించే ఉంటారు. ప్రముఖ కథానాయిక ఆలియా భట్‌ (Alia Bhatt) పరిస్థితి అదేనట. ఏంటా ఇబ్బంది అని చూస్తే.. మనకు ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు కాస్త ఆందోళనకు గురవుతాం.

Alia Bhatt

ఆ సమస్య పరిష్కారం కాగానే హమ్మయ్య అనుకుని సాధారణ స్థితికి వచ్చేస్తాం. కానీ ఆలియా మాత్రం ప్రతి క్షణం ఆందోళనకు గురవుతుందట. ప్రతి విషయానికి మనసులో ఏదో తెలియని గందరగోళపడుతుందట. కరీనా కపూర్‌ పాడ్‌కాస్ట్‌లో ఆలియా మాట్లాడుతూ ఈ విషయాలను షేర్‌ చేసుకుంది. అంతేకాదు ఈ విషయంలో భర్త రణ్‌బీర్‌ కపూర్‌ మద్దతుగా నిలుస్తుంటాడట.ఈ విషయం చెప్పిన ఆలియా ఓ ఉదాహరణను కూడా చెప్పుకొచ్చింది. రాహా పుట్టినప్పుడు పాప ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేయకపోతే జనాలు ఏమనుకుంటారో అని అనుకుని ఆందోళన చెందిందట.

రాహా ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్‌ కాకూడదు అని తన ఆలోచన అని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఆలియా ఆలోచన విషయలో అభిమానులకు ఇప్పుడు క్లారిటీ వచ్చిందని చెప్పాలి. గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా జరిగిన విషయం కూడా చెప్పుకొచ్చింది. గతేడాది క్రిస్మస్‌ సందర్భంగా లంచ్‌ కోసం రణ్‌బీర్‌ – రాహా – ఆలియా బయటకు వెళ్తారట. అప్పుడు ‘మనం రాహాతో కలసి ఈ రోజు ఫొటో దిగుదామా’ అని అడిగాడట రణ్‌బీర్‌.

దాంతో ఆలియాకు మరోసారి కంగారు మొదలైందట. దాంతో నిజంగానే ఫొటో దిగుదామాని అంటున్నావా అని ఆలియా అందట. అలా ప్రతి విషయంలో ప్రతి క్షణం అలాగే అనిపిస్తూ ఉంటుంది అని చెప్పింది. కొన్నిసార్లు ఆ పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని చెబుతుంది. అయితే నా పరిస్థితిని రణ్‌బీర్‌ అర్థం చేసుకుని వేరే విషయాల గురించి మాట్లాడటం మొదలు పెట్టాడట. బాంద్రా, జూహూ అంటూ ఏదో ఒకటి మాట్లాడాడట. దీంతో పరిస్థితి కాస్త కంట్రోల్‌ అయింది అని చెప్పింది.

‘దేవర’ నుండి మరో పోస్టర్‌ రిలీజ్‌… అభిమానులను హ్యాపీ చేయడానికేగా..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus