Maa Oori Polimera 2 Collections: ‘మా ఊరి పొలిమేర 2’ .. రెండో రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే?

  • November 5, 2023 / 11:09 PM IST

2 ఏళ్ల క్రితం వచ్చిన ‘మా ఊరి పొలిమేర’ అనే సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో నేరుగా రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ అందుకుంది. ఎక్కువ వ్యూయర్ షిప్ ని నమోదు చేసి టాప్ 10 మూవీస్ లో ప్లేస్ దక్కించుకుంది ఆ సినిమా. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, బాలాదిత్య, రాకేందు మౌళి ముఖ్యపాత్రల్లో నటించిన ఈ చిత్రానికి గౌరీ కృష్ణ నిర్మాత. నవంబర్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే సెకండ్ పార్ట్ ను థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. గౌరీ కృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని వంశీ నందిపాటి .. బన్నీ వాస్ సాయంతో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ చేశారు.టీజర్, ట్రైలర్స్ కూడా అందరిలో క్యూరియాసిటీని క్రియేట్ చేశాయి. మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.రెండో రోజు కూడా ఈ సినిమా బాగా కలెక్ట్ చేసింది అని చెప్పాలి. ఒకసారి 2 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 1.50 cr
సీడెడ్ 0.25 cr
ఆంధ్ర(టోటల్) 1.09 cr
ఏపీ + తెలంగాణ(టోటల్) 2.84 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.51 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 3.35 cr

‘మా ఊరి పొలిమేర 2’ (Maa Oori Polimera 2) చిత్రాన్ని చాలా వరకు ఓన్ రిలీజ్ చేసుకున్నారు. అయితే థియేట్రికల్ మొత్తంగా రూ.3.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ మూవీ రెండు రోజుల్లోనే రూ.3.35 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.0.15 కోట్ల షేర్ ను రాబడితే సరిపోతుంది. ఆదివారం కలెక్షన్స్ తో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వడం ఈజీ అనే చెప్పాలి.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus