మారి 2 ట్రైల‌ర్ సంద‌డి!

  • December 4, 2018 / 06:32 PM IST

ధనుష్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం ‘మారి 2’. ధనుష్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన సూపర్ హిట్ ‘మారి’ చిత్రానికి ఇది సీక్వెల్. ‘మారి’ చిత్రాన్ని తెలుగులో ‘మాస్’ పేరుతో డబ్ చేసిన సంగతి తెలిసిందే. ‘మారి2’ చిత్రానికి బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తుంది. యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.

క్రిస్మస్ కానుకగా డిసెంబ‌ర్‌21 న‌ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ చిత్ర ట్రైలర్ ను డిసెంబర్ 5 న విడుదల చేయబోతుండడం విశేషం. ఇప్పటికే ఈ చిత్ర ట్రైల‌ర్ కోసం ధనుష్ అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ‘మాస్ 2’ పేరుతో తెలుగులో విడుద‌ల చేయబోతున్నారు. విచిత్రం ఏమిటంటే.. సాయి పల్లవి హీరోయిన్ గా శర్వానంద్ హీరోగా తెలుగులో తెరకెక్కుతున్న ‘పడి పడి లేచె మనసు’ చిత్రం కూడా డిసెంబర్ 21 వ తేదీనే విడుదల కాబోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus