సాధారణంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ లో రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన హీరోలు చాలా తక్కువ, కానీ ఇప్పుడు లెక్కలు మారుతున్నాయి.
యువ హీరో “కిరణ్ అబ్బవరం ” ఈ ప్రాంతం నుంచి వచ్చి మంచి జన ఆధరణ పొంది, సినిమాల పైన సినిమాలు విజయవంతంగా చేసుకుంటూ తనకంటూ ఒక శైలి ఏర్పర్చుకుని ముందుకు వెళ్తున్నాడు. అంతే కాదు తన చుట్టూ ఉన్న వాళ్ళ ఎదుగుదల కి కూడా తనవంతు సాయం చేస్తూనే ఉన్నాడు , ఇప్పుడు మరో రాయలసీమ కుర్రాడు “శ్రీహరి ఉదయగిరి ” నటించిన “మాటరాని మౌనమిది ” అనే సినిమా రిలీజ్ డేట్ ని తన ట్విట్టర్ మాధ్యమం ద్వారా announce చేసి చిత్ర బృందానికి తన విషెస్ తెలియజేసాడు కిరణ్ , ఈ సందర్బంగా చిత్ర బృందం చాలా సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే తిరుపతి కుర్రాడు , ”శ్రీహరి ఉదయగిరి ” నటించిన “మాటరాని మౌనమిది ” సినిమా లోని పాటలు చాలా మంచి స్పందన తెచ్చుకోగా ఇప్పుడు సినిమా “ఆగష్టు 19” న రిలీజ్ అవుతోంది.
Maataraani Mounamidhi is all set to release in THEATRES on AUGUST 19th
Wish you all the best @sriudayagiri
And the entire team of #MM @sukupurvaj #Rudrapictures @GskMedia_PR @MadhuraAudio @ria_purvaj pic.twitter.com/48nzma6Ft5— Kiran Abbavaram (@Kiran_Abbavaram) July 26, 2022