ఒక చిన్న సినిమా అంచనాల్లేకుండానే థియేటర్‌లో విజయం సాధిస్తే, దానికి సీక్వెల్‌పై ఎప్పుడూ ఎక్కువ ఆసక్తి ఏర్పడుతుంది. అలాంటి అంచనాలతో వస్తున్న చిత్రం మ్యాడ్ స్క్వేర్ (Mad Square). మొదటి భాగంగా వచ్చిన మ్యాడ్ సినిమా యూత్ ఆడియన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. కామెడీ, ఫన్, కాలేజ్ మూడ్ కలబోతగా, మినిమం బడ్జెట్‌తో మెజికల్ హిట్ అయ్యింది. అదే బ్లూ ప్రింట్‌ను మరోసారి వాడుతూ మ్యాడ్ స్క్వేర్‌ను తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.
అయితే ఇప్పుడు సీక్వెల్ విషయంలో పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. సినిమా ఏప్రిల్ 29న థియేటర్లకు రానుండగా, ఇప్పటికీ మేజర్ బజ్ రాని పరిస్థితి కనిపిస్తోంది. హీరోలు నార్నె నితిన్ (Narne Nithin) , సంగీత్ శోభన్ (Sangeeth Shobhan) , రామ్ నితిన్ (Ram Nithin) తిరిగి నటిస్తున్నప్పటికీ, ప్రమోషన్స్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు. ముఖ్యంగా సినిమాలో హీరోయిన్ల లేనప్పటికీ, “ప్రతి సీన్‌లో కొత్త అమ్మాయి ఉంటుంది” అనే కాన్సెప్ట్‌ను మేకర్స్ హైలైట్ చేసినా, అది పెద్దగా ఆడియన్స్‌ను ఆకర్షించలేకపోయింది.
ఇక ప్రమోషన్ పరంగా చూస్తే, నితిన్ (Nithiin) హీరోగా వస్తున్న ‘రాబిన్ హుడ్’ (Robinhood) సినిమాతో గట్టి పోటీ ఎదురవుతోంది. వెంకీ కుడుముల (Venky Kudumula) కామెడీ, శ్రీలీల (Sreeleela) గ్లామర్, డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ వంటి పాయింట్లు ఆ సినిమాకి హై బజ్ తీసుకొచ్చాయి. రాబిన్ హుడ్ ప్రమోషన్స్ ఒక రేంజ్‌లో జరుగుతుండగా, మ్యాడ్ స్క్వేర్ మాత్రం మూడో స్థానానికి పరిమితమవుతోంది. ఈ రెండు సినిమాలతో పాటు మోహన్ లాల్ (Mohanlal), పృథ్విరాజ్(Prithviraj Sukumaran) కలయికలో వస్తున్న L2: Empuraan (L2: Empuraan) డబ్బింగ్ వర్షన్ కూడా ఈ వీకెండ్ బాక్సాఫీస్ దగ్గర తలపడుతోంది.
అసలు సమస్య ఏమిటంటే.. మ్యాడ్ హిట్ అయినప్పటికీ, స్క్వేర్ బజ్ ఎందుకు లేదు అనే ప్రశ్నలు రేపుతోంది. బహుశా మేకర్స్ ప్రమోషన్‌లో ఓ కొత్త కోణాన్ని చూపించలేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. మాస్ బిజీ షెడ్యూల్‌లో ప్రేక్షకుల దృష్టి ఆకర్షించాలంటే, బజ్ తప్పనిసరి. ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది. కంటెంట్ తప్ప గొప్పగా ఏమీ లేనప్పుడు.. ప్రీ రిలీజ్ హైప్ లేకపోతే థియేటర్లకు వచ్చే జనాలు తగ్గిపోతున్నారు.
ఈ వీకెండ్ మాత్రం బాక్సాఫీస్‌కి స్పెషల్. మూడు భిన్నమైన సినిమాలు.. కామెడీ, యాక్షన్, మాస్ బ్యాక్డ్రాప్‌లో రాబోతున్నాయి. ఓపెనింగ్స్ పరంగా ‘రాబిన్ హుడ్’ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచేలా ఉంది. కానీ కంటెంట్ క్లిక్కైతే మ్యాడ్ స్క్వేర్ (Mad Square) సర్‌ప్రైజ్ ఇవ్వొచ్చు. మొత్తానికి, ఈవీకెండ్ సినిమాల పోటీ ఆసక్తికరంగా మారనుంది. ఆడియన్స్ ఎంచుకునే సినిమా ఏదో.. రిలీజ్ తర్వాత తేలిపోతుంది.