Madhavan Son Vedanth: స్విమ్మింగ్‌లో మరోసారి పతకాలు సాధించిన వేదాంత్
- October 27, 2021 / 12:40 PM ISTByFilmy Focus
వెర్సటైల్ యాక్టర్ మాధవన్ తనయుడు వేదాంత్ మరోసారి స్విమ్మింగ్ పోటీల్లో అదరగొట్టాడు. బెంగళూరులోని బసవనగుడి అక్వాటిక్ సెంటర్‌లో జరిగిన ‘జూనియర్ నేషనల్ స్విమ్మింగ్ అక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2021’ పోటీల్లో ఈ అదుర్స్ అనిపించాడు. ఈత పోటీల్లో 16 ఏళ్ల వేదాంత్ ఏడు పతకాలతో సత్తాచాటాడు. గతంలోనూ వేదాంతా ఇలా ఈత పోటీల్లో పతకాలు సాధించిన విషయం తెలిసిందే. వేదాంత్ ఈ పోటీల్లో మహారాష్ట్రకి ప్రాతినిథ్యం వహించాడు. 4X100 ఫ్రీస్టైల్ రిలే, 4X200 ఫ్రీస్టైల్ రిలే, 800 మీటర్ల ఫ్రీస్టైల్,

1500 మీటర్ల ఫ్రీస్టైల్‌లో రజత పతకాలు గెలుచుకున్నాడు. 100, 200, 400 మీటర్ల ఫ్రీస్టైల్ పోటీల్లో కాంస్య పతకాలు సాధించాడు వేదాంత్. గత మార్చిలో జరిగిన లాత్వియన్ ఓపెన్ స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లోనూ వేదాంత్ రాణించాడు. ఆ పోటీల్లో కాంస్యంతో సత్తా చాటాడు.
నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!
Most Recommended Video
సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్ టాప్ భామల రెమ్యూనరేషన్ ఎంతంటే?













