మల్టీ టాలెంటెడ్ తల్లాడ సాయి కృష్ణ హీరోగా ఏకదంతాయ సిరి హీరోయిన్ గా తెరకెక్కుతున్న వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్'(Magic Move Ments). గతంలో ‘సంతోషం’ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలు అందించిన సీనియర్ స్టార్ దర్శకులు కె. దశరథ్ సమర్పణలో ‘శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఫిల్మ్స్’ సంస్థ పై తల్లాడ శ్రీనివాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నుండి ‘వాలెంటైన్స్ డే’ సందర్భంగా ఈరోజు ఓ స్పెషల్ పోస్టర్ ను వదిలారు.
నిజంగా వాలెంటైన్స్ డే మూడ్ కి తగ్గట్టుగా ఈ పోస్టర్ చాలా స్పెషల్ గా ఉంది. ప్రేమలో ఉండే మ్యాజికల్ మూమెంట్స్ ని జెంజి కిడ్స్ కి నచ్చే విధంగా ఈ చిత్రాన్ని ఆవిష్కరించనున్నారు. పోస్టర్ అయితే యూత్ ని ఆకట్టుకుంటుంది.
ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు కె. దశరథ్ మాట్లాడుతూ.. “మంచి కథలను చెప్పాలనే ఆసక్తి మొదటి నుండి నాలో ఉంది.అందుకే సాయి కృష్ణ ఈ సినిమా కథ చెప్పిన వెంటనే.. నేను కూడా భాగం కావాలనిపించింది. అందుకే సమర్పకుడిగా వ్యవహరిస్తున్నాను. ఈ సినిమా కథ కొత్తగా, చాలా ఆసక్తికరంగా అనిపించింది. హీరోగా, దర్శకుడిగా సాయి కృష్ణ ఈ కథను డీల్ చేసిన విధానం కూడా మెప్పిస్తుంది. వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ ఆయన తెలిపారు.
నిర్మాత తల్లాడ శ్రీనివాస్ మాట్లాడుతూ.. “దశరథ్ వంటి అగ్ర దర్శకులు, అభిరుచి గల దర్శకులు మా సినిమాను సమర్పిస్తుండటం చాలా ఆనందంగా,అదే విధంగా గర్వంగా అనిపిస్తుంది. సాయి కృష్ణ, సిరి జంట చాలా ఫ్రెష్ గా ఉంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాము” అంటూ పేర్కొన్నారు.
సహ నిర్మాత వెంకట్ దుగ్గిరెడ్డి మాట్లాడుతూ.. “ఈ ప్రాజెక్ట్ లో భాగం కావడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ఈ కథని దర్శకుడు సాయి కృష్ణ చెప్పిందానికంటే బాగా తీశాడు. దశరథ్ గారి సహకారం మాకు కొండంత బలాన్ని ఇచ్చింది. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చింది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని కూడా ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుంది అనే నమ్మకం మాలో ఉంది. మీ అందరికీ వాలెంటైన్స్ డే శుభాకాంక్షలు.