Maha Samudram Collections: మంచి టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘మహా సముద్రం’ ..!

  • October 18, 2021 / 01:06 PM IST

శర్వానంద్, సిద్దార్థ్ లు హీరోలుగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘మహా సముద్రం’. అనిల్ సుంకర నిర్మించిన ఈ చిత్రాన్ని ‘ఆర్.ఎక్స్.100’ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించాడు. ఇన్‌టెన్స్ ల‌వ్‌, యాక్ష‌న్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో అదితిరావు హైద‌రి, అను ఇమ్మాన్యుయేల్ లు హీరోయిన్స్‌గా నటించారు. దసరా కానుకగా అక్టోబర్ 14న ఈ చిత్రం విడుదల అయ్యింది. సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయి. మొదటి రోజు పర్వాలేదు అనిపించిన ఈ చిత్రం ఆ తర్వాత పూర్తిగా స్లీప్ ఏసిందనే చెప్పాలి.

ఒకసారి 4(ఫస్ట్ వీకెండ్) రోజుల కలెక్షన్లను గమనిస్తే :

నైజాం 1.81 cr
సీడెడ్ 1.04 cr
ఉత్తరాంధ్ర 0.83 cr
ఈస్ట్ 0.43 cr
వెస్ట్ 0.32 cr
గుంటూరు 0.57 cr
కృష్ణా 0.38 cr
నెల్లూరు 0.29 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 5.67 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.59 Cr
వరల్డ్ వైడ్ (టోటల్) 6.26 cr

‘మహా సముద్రం’ చిత్రానికి రూ.16.48 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.17 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి ఈ చిత్రం రూ.6.26 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది.బ్రేక్ ఈవెన్ కు మరో రూ.10 కోట్ల పైనే షేర్ ను రాబట్టాలి.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus