సావిత్రి రోల్ కోసం కీర్తి కంటే ముందే నిత్యాని అడిగిన నాగ్ అశ్విన్

అరుంధతి కథ మొదట మమతా మోహన్ దాస్ వద్దకు వెళ్లింది. ఆమె సినిమాని చేయనని చెప్పింది. ఆ అవకాశం అనుష్కకి వరించింది. మంచి కథకు స్వీటీ తన నటనకు జోడించి మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూడలేదు. అనుష్కకు అరుంధతి ఓ టర్నింగ్ పాయింట్ అయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ కి కూడా మహానటి కెరీర్ ని మలుపు తిప్పే చిత్రం అవుతుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ రేపు రిలీజ్ కాబోతోంది. ఇందులో కీర్తి సురేష్ సావిత్రి రోల్ పోషించింది. ఈ మూవీ స్టిల్స్, టీజర్, ట్రైలర్ లలో కీర్తి సురేష్ ని చూసిన వారందరూ సావిత్రిని గుర్తుకు తెచ్చిందని చెబుతున్నారు.

తన నటనతో మరింత ఆకట్టుకుంటుందని చెబుతున్నారు. అయితే ఈ పాత్ర మొదట నిత్యామీనన్ కి వెళ్ళిందంట. అయితే కొంచెం బరువు తగ్గమని డైరక్టర్ చెప్పడంతో.. తగ్గడం ఇష్టంలేక నో చెప్పిందంట. ఇదే విషయాన్నీ ఆమెను అడగగా.. “అప్పుడు డేట్స్ ఖాళీలేవు అందుకే నో చెప్పాను” అని సమాధానమిచ్చింది. ఏదిఏమైనా మంచి ఛాన్స్ ని మిస్ చేసుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. రేపు థియేటర్లలోకి రానున్న ఈ మూవీ విజయాన్ని చూసి తప్పకుండా నిత్యా బాధపడుతుందని అంచనా వేస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus