మహానుభావుడు మూల కథ ఆ మలయాళ చిత్రమే..
- August 31, 2017 / 08:11 AM ISTByFilmy Focus
శర్వానంద్ తాజా చిత్రం “మహానుభావుడు” టీజర్ సృష్టించిన హల్ చల్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ “ఓసీడీ” అనే రుగ్మతి ఉన్న వ్యక్తిగా కనిపిస్తున్నాడు. ఓసీడీ అనేది జబ్బు కాదు.. అదోరకమైన అలవాటు. ప్రతి విషయంలో విపరీతమైన నీట్ నెస్ మెయింటైన్ చేస్తుంటారు.
“భలే భలే మగాడివోయ్” చిత్రంలో నానీని మతిమరుపు కుర్రాడిగా చూపించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మారుతి.. ఇప్పుడు “మహానుభావుడు” చిత్రంలో శర్వాను ఓసీడీ ఉన్న వ్యక్తిగా చూపించి ఇంకో బ్లాక్ బస్టర్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అయితే.. ఇదేం కొత్త సినిమా కాదని ఆల్రెడీ ఈ తరహా కథాంశంతో కొన్ని కొరియన్ సినిమాలు రూపొందాయని కొందరు అంటుంటే.. విపరీతమైన సినిమా నాలెడ్జ్ ఉన్నవారు మాత్రం ఇది మలయాళ హిట్ సినిమా “నార్త్ 24 కాతమ్”కు రీమేక్ అని చెబుతున్నారు. వీటిలో ఏది నిజమో తెలియాలంటే సినిమా విడుదల తేదీ వరకూ వేచి చూడాల్సిందే.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















