Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

సుమంత్ సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి దూకుడు చూపిస్తున్నాడు. ధియేట్రికల్ మార్కెట్ సంగతి ఎలా ఉన్నా.. అతని ఓటీటీ మార్కెట్ చాలా బెటర్ గా ఉంది. ‘అనగనగా’ తో డీసెంట్ హిట్ అందుకున్న సుమంత్.. అటు తర్వాత ‘న్యూటన్స్ థర్డ్ లా’ చేశాడు. అది థియేటర్లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నప్పటికీ అక్కడ అంతంత మాత్రంగానే పెర్ఫార్మ్ చేసింది. కానీ ఓటీటీ రిలీజ్ తర్వాత దానికి మంచి అప్రీసియేషన్ లభించింది. ఇదే ఊపులో సుమంత్ నుండీ వస్తున్న మరో సినిమా ‘మహేంద్రగిరి వారాహి'(Mahendragiri Varahi).

Mahendragiri Varahi

సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో రూపొందిన సినిమా ఇది. గతంలో ఇతను సుమంత్ తో ‘సుబ్రహ్మణ్యపురం’ అనే సినిమా తీశాడు. అది పర్వాలేదనిపించేలా ఆడింది. ఇప్పుడు వీరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా కాబట్టి ‘మహేంద్రగిరి వారాహి’ పై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. టీజర్ సంగతి ఎలా ఉన్నా.. ట్రైలర్ అయితే బాగుంది. సినిమాపై కొంత బజ్ క్రియేట్ చేసింది. అందులోనూ సిద్ధూ జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేశ్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటించడం వల్ల కూడా.. ఆడియన్స్ ఈ సినిమాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు.

ఆల్రెడీ ఈ చిత్రాన్ని దర్శకనిర్మాతలు కొంతమందికి స్పెషల్ షోలు వేసి చూపించారట. సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం జరిగింది. వారి టాక్ ప్రకారం.. ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రం 2 గంటల 34 నిమిషాల నిడివి కలిగి ఉందట. సినిమా స్టార్టింగ్ పోర్షన్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంటాయట. తర్వాత కథనం వేగం పుంజుకుంటుంది అని చెబుతున్నారు. ఇంటర్వల్ సీక్వెన్స్ మంచి హై ఇస్తుందట. సెకండాఫ్ లో కూడా కొన్ని బ్లాక్స్ బాగుంటాయట.

డివైన్ ఫీలింగ్ కలిస్తాయట. సిద్దూ జొన్నలగడ్డ కెమియో బాగుంటుందని అంటున్నారు. ఐశ్వర్య రాజేశ్ ట్రాక్ కూడా గూజ్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయట. మొత్తంగా సినిమా ఆకట్టుకునే విధంగా ఉంటుందని అంటున్నారు. మరి రిలీజ్ రోజు మార్నింగ్ షోల నుండీ ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Read Today's Latest Movies Update. Get Filmy News LIVE Updates on FilmyFocus