‘బేబీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్లో రూపొందిన చిత్రం ‘ఎపిక్'(Epic). ‘ఈటీవీ విన్’ ’90’s’ వెబ్ సిరీస్ తో భీభత్సమైన ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఇంకో రకంగా అతనికి ఇది (ధియేట్రికల్) డెబ్యు మూవీ. హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ చిత్రానికి సంగీతం అందించాడు. ‘సంచారమే’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యింది. సినిమాపై ఆడియన్స్ అటెన్షన్ ఏర్పడేలా చేసింది.
ఇక ట్రైలర్ క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ఆదిత్య హాసన్ నుండీ ఈ రేంజ్ బోల్డ్ కంటెంట్ ఊహించలేదంటూ చాలా మంది నెటిజెన్లు నెగిటివ్ కామెంట్లు చేశారు. అయితే వాటన్నిటినీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో చిత్ర బృందం తిప్పి కొట్టడం జరిగింది. ఏదేమైనా ఇలాంటి వ్యవహారాలన్నీ ‘ఎపిక్’ పబ్లిసిటీకి పనికొచ్చాయి అని చెప్పొచ్చు. ఆ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘ఎపిక్’ సినిమాని ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది పెద్దలకి నిర్మాత నాగవంశీ చూపించారట.
సినిమా చూసిన అనంతరం వారు తమ అభిప్రాయాన్ని పంచుకోవడం జరిగింది. వారి టాక్ ప్రకారం సినిమా రన్ టైమ్ 2 గంటల 29 నిమిషాల నిడివి కలిగి ఉందట. ఫస్ట్ హాఫ్..లో యూత్ మెచ్చే కామిడీ అలాగే బ్రీజీ ఎమోషన్స్ వంటివి ఫ్రెష్ ఫీల్ ఇస్తాయట. సెకండాఫ్ లో వచ్చే ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా మీనింగ్ ఫుల్ గా ఉంటాయని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి ప్రాణం పోసింది అంటున్నారు. వీకెండ్ కే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు.
చూడాలి మరి అందులో ఎంతవరకు నిజం ఉందనేది..! ఇక ప్రీమియర్ షోల నుండీ ‘ఎపిక్’ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది కూడా ఆసక్తికరంగా మారింది.