మరోసారి ‘స్పైడర్’ డైరెక్టర్ పై అభిమానాన్ని చాటుకున్నాడు..!

ఇటీవల ‘దర్బార్’ ప్రమోషన్లలో భాగంగా మురుగదాస్ మహేష్ బాబు పై చేసిన కామెంట్స్ పెద్ద వైరల్ అయిన సంగతి తెలిసిందే. ‘ ‘స్పైడర్’ సినిమాతో మహేష్ ను తమిళ ప్రేక్షకులకి పరిచయం చేస్తున్నాను అనుకున్నాను కానీ… తెలుగు ప్రేక్షకులకి ఆయనో పెద్ద స్టార్ హీరో అన్న సంగతి మర్చిపోయాను. ఆ విషయం ఆయన కూడా ఎప్పుడూ గుర్తుచేసేవారు కాదు. కథకి అలా సరెండర్ అయిపోయేవారు. సినిమా రిలీజై ప్లాప్ టాక్ వచ్చినా.. సరే మహేష్ నాకు రోజూ ఫోన్ చేసి మాట్లాడేవారు. ఆయనకి ప్లాప్ ఇచ్చాను అని ఇప్పటికీ నేను బాధపడుతుంటాను’ అంటూ మురుగదాస్ చెప్పుకొచ్చాడు.

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్స్ లో భాగంగా మహేష్.. మురుగదాస్ కామెంట్స్ పై స్పందించాడు.. ” ‘స్పైడర్’ సినిమా ఫలితం ఎలా ఉన్నా.. నేను ఆ సినిమాకి పనిచేసిన ప్రతీరోజూ బాగా ఎంజాయ్ చేశాను. మురుగదాస్ గారు ఇండియాలోనే బెస్ట్ డైరెక్టర్.” అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు ‘నేను చెన్నై నుండీ హైదరాబాద్ కు వచ్చేసిన తర్వాత ఇక్కడ నాకు పెద్దగా ఫ్రెండ్స్ లేరు. నా డైరెక్టర్లే నాకు ఫ్రెండ్స్’ అంటూ మహేష్ బాబు తెలిపాడు. ఇక సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న విడుదల కాబోతుంది.

అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus