సూపర్ స్టార్స్… అంటే వాళ్లే అంటున్న ప్రిన్స్!!

సినిమా పరిశ్రమ అన్న తరువాత కాస్త లౌక్యం తెలియాలి అని అంటారు…అయితే మన టాలీవుడ్ స్టార్స్ విషయానికే వస్తే ఎవరికి వాళ్ళు తమ తమ అభిమాన హీరోల గురించి అవకాశం వచ్చినప్పుడల్లా చెబుతూ ఉంటారు. అయితే అదే క్రమంలో ప్రిన్స్ సైతం తన మనసులోని మాటను బయట పెట్టాడు…ఇంతకీ విషయం ఏంటి అంటే….సూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా స్పైడర్. 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమాకి ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు…వరుస పెట్టి ప్రిన్స్ మహేష్, డైరెక్టర్ మురుగుదాస్ ఇద్దరూ ఇంటర్‌వ్యూస్ ఇస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచడానికి పక్కా ప్లాన్ తో ముందుకు పోతున్నారు…ఒక పక్క సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నప్పటికీ అదే క్రమంలో కాస్త భయాలు కూడా ఉండడంతో ఆ భయాన్ని పోగొట్టి సినిమాని సక్సెస్ చెయ్యాలి అన్న ఆలోచనలో ఉన్నారు మన ప్రిన్స్ అండ్ టీమ్..ఇదిలా ఉంటే మరో పక్క ఈ సినిమా విషయమే తీసుకుంటే…ప్రిన్స్ మాట్లాడుతూ…మురుగదాస్ డైరక్షన్ లో ఓ రేసీ మూవీగా ఈ స్పైడర్ రాబోతుంది.

మహేష్ స్పై ఏజెంట్ గా కనిపించబోతున్న ఈ సినిమాకు హారిస్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. తుపాకి టైంలోనే మురుగదాస్ తో పనిచేయాల్సి ఉన్నా అది ఇప్పటికి నెరవేరిందని అన్నారు మహేష్. సినిమా తప్పకుండా ఆడియెన్స్ ను మంచి థ్రిల్ కు గురి చేస్తుందని అన్నారు. ఇక మరో పక్క మీకు నచ్చిన హీరోలు ఎవరు అన్న ప్రశ్నకు స్పందిస్తూ…మన దేశంలో చాలా పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారని, కానీ తన దృష్టిలో మాత్రం ఇద్దరే సూపర్ స్టార్స్ అని వాళ్ళు చిరంజీవి, రజినికాంత్ అని, సినిమాతో సంబంధం లేకుండా వాళ్ల కోసం ప్రేక్షకులు థియేటర్స్ కు వెళ్తారని ఆయన చెప్పాడు…నిజమే ప్రిన్స్…కాకపోతే వీళ్ళకన్నా ముందే మీ నాన్న కృష్ణ, పెద్దాయన ఎన్టీఆర్ ఇద్దరూ సూపర్ స్టార్స్ ఉన్నారు అన్న సంగతి మరచిపోతే ఎలా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus