మహేష్ మాటతో సంతోషించిన పవన్ అభిమానులు!

పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మంచి స్నేహితులు. అయితే వీరి అభిమానుల మధ్య మాత్రం అంత స్నేహం లేదు. అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయి. తాజాగా పవన్ ఫ్యాన్స్ మహేష్ బాబు పై కోపం తెచ్చుకున్నారు. అసలు విషయం తెలిసి శాంతించారు. వివరాల్లోకి వెళితే.. “స్వచ్చ భారత్” కి సంబంధించి పలువురు సినీ ప్రముఖులకు ప్రధాని నరేంద్ర మోడీ అభినందనందిస్తూ లెటర్ పంపించారు. దర్శకధీరుడు రాజమౌళితో సహా ప్రిన్స్ మహేష్ బాబుకు కూడా ఈ లెటర్లు రాసారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. రాజమౌళి అయితే తనకి వచ్చిన లేఖను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, మోడీకి ధన్యవాదాలు తెలిపారు.

దీంతో ఈ విషయంపై చర్చ మొదలయింది. గత ఎన్నికలలో బీజీపీ తరపున ప్రచారం నిర్వహించిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ను వదిలిపెట్టి, మహేష్ కు లెటర్ రాసారని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఇదే అంశాన్ని మహేష్ బాబు ముందు ఉంచగా ఆయన క్లారిటీ ఇచ్చారు. ” నాకు ప్రధాని నుంచి  అలాంటి ఉత్తరమేమి రాలేదు, అదంతా ఒక పుకారు మాత్రమే” అని ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. దీంతో  పవన్ ఫ్యాన్స్ కోపం పోయింది. పొరపాటు పడ్డామని తెలుసుకున్నారు

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus