చిరు, చరణ్ కి చాలా క్లోజ్ అని చెప్పిన మహేష్ బాబు!

  • April 14, 2017 / 01:21 PM IST

సూపర్ స్టార్ మహేష్ బాబుకి కోలీవుడ్ లో అభిమానులున్నారు. అయినా ఇప్పటివరకు  డైరక్ట్ మూవీ చేయలేదు. మురగదాస్ దర్శకత్వంలో చేస్తున్న ద్విభాషా చిత్రం స్పైడర్ ద్వారా అడుగుపెడుతున్నారు. మొన్న ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయి తెలుగు, తమిళ సినీ ఫ్యాన్స్ ని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఓ తమిళ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ అనేక ఆసక్తికర సంగతులు వెల్లడించారు. టాలీవుడ్ లో చిరంజీవి, రామ్ చరణ్ లు తనకు అత్యంత సన్నిహితులని వివరించారు. వారిద్దరితో తానూ చాలా క్లోజ్ గా ఉంటానని వెల్లడించారు.

“కోలీవుడ్ హీరో విజయ్ నాకు మంచి మిత్రుడు. ఇద్దరం కలసి మణిరత్నం సినిమాలో నటిద్దామని అనున్నాం. కానీ కుదరలేదు. హీరో సూర్య, కార్తి లు నా స్కూల్ మేట్స్. వారిద్దరితో నాకు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు స్నేహం బలపడుతూ వచ్చింది.” అని ప్రిన్స్ చెప్పారు. ఆయన ఇంకా వివిధ ప్రశ్నలకు స్పందిస్తూ రాజకీయాలపై తనకు పెద్దగా ఆసక్తి లేదని, రాజకీయల్లోకి వస్తే మంచిదో, కాదో కూడా తనకు తెలియదని తెలివిగా సమాధానం చెప్పారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus