భారీ ప్రాజక్ట్ లో కృష్ణుడిగా పరిశీలనలో మహేష్, హృతిక్ పేర్లు
- April 19, 2017 / 12:38 PM ISTByFilmy Focus
భారతీయ సినీ పరిశ్రమ గర్వించతగ్గ ప్రాజక్ట్ త్వరలో పట్టాలెక్కనుంది. 1000 కోట్లతో నిర్మితం కానున్న మహాభారతం సినిమా ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ప్రముఖ రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఎమ్టీ వాసుదేవన్ నాయర్ రచించిన ‘రండమోజమ్’ అనే నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శ్రీకుమార్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఇందులో భీముడిగా మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ ఖరారు అయ్యారు. ఆ పాత్ర చుట్టూ కథ సాగుతుందని సమాచారం. అయితే ఇందులో వివిధ భాషల్లోని స్టార్స్ నటింపచేయించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
అందులో భాగంగానే కృష్ణుడి పాత్ర కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును అనుకుంటున్నట్లు తెలిసింది. ఈ పాత్ర కోసం మహేష్ తో పాటే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కూడా పరిశీలనలో ఉన్నారని సమాచారం. ఈ చిత్రంలో నటించేందుకు ఎవరు ఉత్సాహం చూపిస్తారో త్వరలో తెలియనుంది. ప్రముఖ వ్యాపారవేత్త డా. బి. ఆర్.శెట్టి నిర్మిస్తున్న ఈ మూవీ 2020 లో రిలీజ్ కానుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















