మహేష్ యాజ్ వాస్కోడిగామ

  • June 27, 2016 / 11:22 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమా వచ్చే నెల 15 నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. రూ.90 కోట్ల బడ్జట్ తో తెలుగు, తమిళం భాషల్లో నిర్మితమవుతున్న ఈ మూవీతో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం కాబోతోంది. న్యాయ వ్యవస్థపై సెటైర్ గా ఉండే కథలో మహేష్ ఇది వరకు కనిపించని లుక్ తో ఆకట్టు కోనున్నట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఏ వార్త బయటకు రాకుండా చిత్ర బృందం చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది.

అయినా ఈ చిత్రం పేరు పై కొన్ని రూమర్లు ఫిల్మ్ నగర్లో వినిపిస్తున్నాయి. మొదట్లో “ఎనిమీ” అని చెప్పుకున్నా, తర్వాత “జస్టిస్” అని వినిపించింది. ప్రస్తుతం స్టన్ గన్, వాస్కోడిగామా పేర్లు  పరిశీలనలో ఉన్నాయి. లండన్ టూర్ ముగించుకుని కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ చేరుకున్న మహేష్ తన సినిమా చర్చల్లో పాల్గొంటున్నారు. చిత్ర బృందం సూచించిన పేర్లలో వాస్కోడిగామ టైటిల్ సూపర్ స్టార్ కి బాగా నచ్చిందని తెలిసింది. ఈ పేరునే ఖరారు చేయనున్నట్లు సమాచారం.

త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత సంతోష్ శివన్ సినిమాటో గ్రాఫర్ గా పనిచేస్తున్న ఈ సినిమా లో తమిళ్  డైరక్టర్ ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించనున్నారు. ఇప్పటికే మ్యూజిక్ డైరక్టర్ హరీష్ జయరాజ్ కొన్ని పాటలను మురుగదాస్ కి వినిపించడం.. అందుకు దర్శకుడు  ఓకే చెప్పడం జరిగిపోయాయి. తొలి షె డ్యూల్ హైదరాబాద్లో మహేష్, పరిణీతి చోప్రాల పై పాటతోనే మొదలు కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus