తమిళ స్టార్స్ కి నిద్రలేకుండా చేస్తున్న మహేష్
- July 20, 2017 / 06:43 AM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా గురించి టాలీవుడ్ లో చర్చించుకోవడం సర్వసాధారణం. ఇప్పుడు కోలీవుడ్ లో మహేష్ హాట్ టాపిక్ అయ్యారు. కారణం స్పైడర్. ఈ మూవీ ఏకకాలంలో తెలుగు, తమిళంలో రూపుదిద్దుకుంటోంది. అక్కడ స్టార్ డైరక్టర్ గా పేరుపొందిన మురుగదాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ మూవీ టీజర్ యూట్యూబ్లో సంచలనం సృష్టించింది. దీంతో అక్కడ థియేటర్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధమవుతున్నారు. తాజాగా తమిళ వెర్షన్ శాటిలైట్ రైట్స్ 18 కోట్లకు ఏజీఎస్ అనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ కైవసం చేసుకుంది. శాటిలైట్ రైట్స్ ఈ రేంజ్ లో ధర పలకడంతో అక్కడి స్టార్ హీరోలు ఆశ్చర్యపోతున్నారు.
మరి సినిమా థియేటర్ రైట్స్ ఎన్ని కోట్లు ధర పలుకుతుందో, ఎంత కలక్షన్స్ రాబడుతుందోనని ఆలోచనలతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 27 న రిలీజ్ కానుంది. ఆ రోజు కోసం ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















